తెలంగాణలో నేడు, రేపు వర్షాలు.. సీజనల్ వ్యాధులతో జాగ్రత్త : వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
హైదరాబాద్ : నిన్నటిదాకా.. మండిపోతున్న ఎండలతో కాకరేపిన వాతావరణం చల్లబడింది. తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందించింది వాతావరణ శాఖ. తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఎండ వేడి, ఉక్కపోత, రాత్రి అయితే చాలు చలి తీవ్రత చంపేస్తుంది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో వర్షాలు కురవబోతున్నాయని మరో వార్తను మోసుకొచ్చింది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శని, ఆదివారాలు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.
ఉపరితల ఆవర్తనం కారణంగానే రాష్ట్రంలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెబుతోంది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా… మిగతా ప్రాంతాల్లో మామూలుగానే నమోదు అవుతున్నాయి. హైదరాబాద్, నల్గొండ కాకుండా మిగిలిన ప్రాంతాల్లోనూ సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో సాధారణం కంటే రెండు డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది.
తెలంగాణలో మినహాయిస్తే మిగిలిన రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత రాబోయే రోజుల్లో 34 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, చలి…ఇప్పుడు వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తారడంతో.. సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టడం లేదు. వర్షాల కారణంగా జలుబు, దగ్గు ఇలాంటి సమస్యలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు వీటి బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నందున మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అంటువ్యాధుల బారిన పడకుండా శక్తి పెరగడానికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.