హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే వుంది. తాజాగా(శనివారం రాత్రి 8గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు)రాష్ట్రవ్యాప్తంగా 23,806మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 857 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 46,42,276 కి చేరగా కేసుల సంఖ్య 2,51,188 కి చేరింది. 

ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో 1504 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,30,568కి చేరింది. దీంతో  ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,239కి చేరింది. 

read more  తెలంగాణ కరోనా అప్ డేట్: ఆందోళనకరం... దేశ రికవరీ రేటుకంటే దిగువకు రాష్ట్రం

 ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో నలుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1381కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 92.5శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 91.79శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 250 కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 61, రంగారెడ్డి 88, భద్రాద్రి కొత్తగూడెం 35, కరీంనగర్ 48, ఖమ్మం 25, నల్గొండ 30, వరంగల్ అర్బన్ 38 కేసులు నమోదయ్యాయి. మిగతాజిల్లాలో కేసుల సంఖ్య కాస్త తక్కువగా వున్నాయి. 

పూర్తి వివరాలు