తెలంగాణ కరోనా అప్ డేట్: ఆందోళనకరం... దేశ రికవరీ రేటుకంటే దిగువకు రాష్ట్రం
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే వుంది. తాజాగా(శుక్రవారం రాత్రి 8గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు)రాష్ట్రవ్యాప్తంగా 42,673మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,440 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 46,18,470 కి చేరగా కేసుల సంఖ్య 2,50,331 కి చేరింది.
అయితే ఆందోళనకర విషయమేమిటంటే ఇంతకాలం పాజిటివ్ కేసుల కంటే రికవరీలే అధికంగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చాయి. అయితే తాజాగా పాజిటివ్ కేసుల కంటే తక్కువగా 1481 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా నుండి కోలుకున్నవారి సంఖ్య 2,29,064కి చేరింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,890కి చేరింది.
read more హైదరాబాదులో తగ్గని కరోనా: తెలంగాణలో కొత్తగా 1607 పాజిటివ్ కేసులు
ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1377కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.55శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 92.4శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 91.50శాతంగా వుంది.
జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 278 కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 133, రంగారెడ్డి 112, భద్రాద్రి కొత్తగూడెం 97, కరీంనగర్ 68, ఖమ్మం 91, నల్గొండ 70 కేసులు నమోదయ్యాయి. మిగతాజిల్లాలో కేసుల సంఖ్య కాస్త తక్కువగా వున్నాయి.
పూర్తి సమాచారం