హైదరాబాద్: తెలంగాణలో గతకొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తాజాగా పెరిగింది. రికవరీ కేసుల కంటే పాజిటివ్ కేసులే అధికంగా వుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం రాష్ట్రంలో 18,456 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

ఇక గత 24 గంటల్లో(బుధవారం రాత్రి 8గంటల నుండి గురువారం రాత్రి 8గంటల వరకు) 43,790 టెస్టులు చేయగా 1,531 మందికి పాజిటివ్ గా తేలినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం టెస్టుల సంఖ్య 42,40,748కి చేరితే మొత్తం కేసుల సంఖ్య 2,37,187కు చేరింది. 

ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారిలో తాజాగా 1,048మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2,17,401కి చేరింది. అయితే రికవరీల కంటే పాజిటివ్ కేసుల అధికంగా వుండటం కాస్త ఆందోళన కలిగించే అంశమే. 

కరోనా మరణాల విషయానికి వస్తే తాజాగా ఆరుగురు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1330కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.56శాతంగా, రికవరీ రేటు 91.65శాతంగా వుంటే కేంద్రంలో ఇవి 1.5, 91శాతంగా వున్నాయి. 

జిల్లాల వారిగా చూసుకుంటే జిహెచ్ఎంసి(హైదరాబాద్) లో అత్యధికంగా 293, రంగారెడ్డిలో 114, మేడ్చల్ లో 120 కేసులు బయటపడ్డాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం 96, జగిత్యాల 61, కరీంనగర్ 71, ఖమ్మం 83, నల్గొండ 74, వరంగల్ అర్బన్ 54 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో కేసుల సంఖ్య తక్కువగానే వున్నాయి. 

పూర్తి వివరాలు: