తెలంగాణ కరోనా అప్ డేట్: భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు
తెలంగాణలో గత 24గంటల్లో నమోదయిన కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా వుంది.
హైదరాబాద్: తెలంగాణలో తాజాగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. గత 24 గంటల్లో(శనివారం రాత్రి 8 గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 25643మందికి కరోనా టెస్ట్ నిర్వహించగా 922మందికి మాత్రమే పాజిటివ్ గా తేలినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. చాలారోజుల తర్వాత వెయ్యికి తక్కువగా కేసులు నమోదవడాన్ని బట్టి చూస్తే మెళ్లిగా రాష్ట్రం కరోనా కోరల్లోంచి బయటపడుతున్నట్లు కనిపిస్తోంది.
తాజా కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,40,970కి చేరింది. ఇక మొత్తం టెస్టుల సంఖ్య 43,49,309కి చేరింది. మరోవైపు తాజాగా కరోనా నుండి 1,456మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారినుండి సురక్షితంగా బయటపడ్డవారి సంఖ్య 2,21,992కి చేరింది.
read more తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 1,416 పాజిటివ్ కేసులు
అయితే తాజాగా కరోనాతో బాధపడుతూ ఏడుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1348కి చేరింది. కరోనా మరణాల రేటు రాష్ట్రంలో 0.5శాతంగా వుంటే దేశంలో 1.5శాతంగా వున్నట్లు, రికవరీ రేటు రాష్ట్రంలో 92.12శాతంగా వుంటే దేశంలో 91.6శాతంగా వున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 17,630 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
జిల్లాలవారిగా చూసుకుంటే జిహెచ్ఎంసీ(హైదరాబాద్) లో అత్యధికంగా 256 కేసులు బయటపడ్డాయి. రంగారెడ్డి 56, మేడ్చల్ 40, వరంగల్ అర్బన్ 37, సంగారెడ్డి 44, సిద్దిపేట 33, నల్గొండ 33, కరీంనగర్ 42, భద్రాద్రి కొత్తగూడెం 37, జగిత్యాల 31కేసులు నమోదవగా మిగతా జిల్లాల్లో కేసుల సంఖ్య నామమాత్రంగా వున్నాయి.
పూర్తి వివరాలు: