తెలంగాణ కరోనా అప్ డేట్: ఆందోళన కలిగిస్తున్న వైద్యారోగ్య శాఖ ప్రకటన
తెలంగాణలో మరోసారి కరోనా మహమ్మారి ఆందోళనకరంగా మారింది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మరోసారి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా(మంగళవారం రాత్రి 8గంటల నుండి బుధవారం రాత్రి 8 గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 41,962 మందికి పరీక్షలు నిర్వహించగా 1,504మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,35,656కు చేరగా టెస్టుల సంఖ్య 41,96,958కి చేరాయి.
ఆందోళనక విషయమేంటంటే ఇప్పటివరకు పాజిటివ్ కేసుల కంటే రికవరీ అయినవారి సంఖ్యే అధికంగా వుండగా తాజాగా రికవరీల కంటే పాజిటివ్ కేసులే అధికంగా వున్నాయి. ఇప్పటికే కరోనా బారినపడ్డ వారిలో 1,436మంది సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,16,353కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,979 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఇక కరోనా కారణంగా తాజాగా ఐదుగురు చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 1324కు చేరుకుంది. కరోనా మరణాల రేటు రాష్ట్రంలో 0.56 శాతంగా వుండగా దేశంలో అది 1.5శాతంగా వుంది. అలాగే రికవరీ రేటు రాష్ట్రంలో 91.80శాతంగా వుంటే దేశంలో 90.9శాతంగా వుంది.
జిల్లాల వారిగా చూసుకుంటే జిహెచ్ఎంసీ(హైదరాబాద్)లో అత్యధికంగా 288 కేసులు బయటపడ్డాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం 83, కరీంనగర్ 66, ఖమ్మం 84, మేడ్చల్ 118, నల్గొండ 93, రంగారెడ్డి 115, సిద్దిపేట 73 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 50కంటే తక్కువగా వున్నాయి.
పూర్తి వివరాలు: