హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటన ప్రకారం గత 24గంటల్లో(ఆదివారం రాత్రి 8 గంటల నుండి సోమవారం రాత్రి 8గంటల వరకు) 21,099 మందికి పరీక్షలు నిర్వహించగా 837మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 2,32,671 కు చేరగా టెస్టుల సంఖ్య 41,15,516కు చేరాయి. 

ఇక  గత 24గంటల్లో కరోనా కారణంగా కేవలం నలుగురు మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1315కి చేరింది. అయితే ఇప్పటికే కరోనా బారినపడ్డ వారిలో తాజాగా 1,554మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుంటే ఇప్పటివరకు కరోనా బారినుండి సురక్షితంగా బయటపడ్డవారి సంఖ్య 17,890కి చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 91.14శాతం, మరణాల రేటు 0.56శాతంగా వుంటే దేశంలో ఇవి 90.3, 1.5శాతంగా వున్నాయి. 

read more  తెలంగాణలో తగ్గిన కరోనా ఉధృతి: కొత్తగా 582 కేసులు, నలుగురు మృతి

జిల్లాల విషయాని వస్తే జిహెచ్ఎంసీ(హైదరాబాద్) 185 కేసులు మాత్రమే బయటపడ్డాయి. కరీంనగర్ 51, ఖమ్మం 76, రంగారెడ్డి 59 కేసులు మాత్రమే బయటపడ్డాయి. ఇంతకాలం మేడ్చల్ జిల్లాలో కేసుల సంఖ్య ఎక్కువగా వుండగా తాజాగా కేవలం 41మాత్రమే బయటపడ్డాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం 48, వరంగల్ అర్బన్ లో 34 కేసులు మాత్రమే నమోదయ్యాయి.