తెలంగాణ కరోనా అప్ డేట్: కొత్తగా 1,421 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా కేసులు మెల్లిమెల్లిగా తగ్గుతున్నాయి.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మెల్లిగా తగ్గుతూ వస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటన ప్రకారం గత 24 గంటల్లో (బుధవారం రాత్రి 8గంటల నుండి గురువారం రాత్రి 8గంటల వరకు) 38,484మందికి పరీక్షలు నిర్వహించగా 1,421 పాజిటివ్ కేసులు బయటపడినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు చేపట్టిన మొత్తం టెస్టుల సంఖ్య 40,17,353కు చేరుకోగా మొత్తం కేసుల సంఖ్య 2,29,001కి చేరాయి.
ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారిలో తాజాగా 1,221మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ మహమ్మారి నుండి సురక్ష్క్షితంగా బయటపడ్డవారి సంఖ్య 2,07,326కు చేరింది. అయితే తాజాగా వైరస్ ఆరుగురిని బలితీసుకుంది. ఈ మరణాలతో కలుపుకుంటే ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1298మంది చనిపోయారు.
read more తెలంగాణ కరోనా అప్ డేట్: బుధవారం ఒక్కరోజే... 1,456మందికి పాజిటివ్
దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5శాతంగా వుంటే రాష్ట్రంలో అది కేవలం 0.56శాతంగా మాత్రమే వుంది. అలాగే రికవరీ రేట్ రాష్ట్రంలో 90.53శాతంగా వుంటే దేశంలో 89.5శాతంగా వున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
జిల్లాల వారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా జిహెచ్ఎంసీ(హైదరాబాద్) లో 249కేసులు బయటపడ్డాయి. ఇక రంగారెడ్డి 97, మేడ్చల్ 111, భద్రాద్రి కొత్తగూడెం 86, కరీంనగర్ 75, ఖమ్మం 89, నల్గొండ 79, సిద్దిపేట 57, వరంగల్ అర్బన్ 52 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాలో కేసుల సంఖ్య తక్కువగానే వున్నాయి.