హైదరాబాద్: తెలంగాణపై కరోనా వైరస్ ప్రభావం మెల్లిగా తగ్గుతోంది. గతకొద్ది రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా బుధవారం ఒక్కరోజే 38,565మందికి పరీక్షలు చేపట్టగా 1,456మందికి పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 39,78,869కి చేరగా కేసుల సంఖ్య 2,27,580కి చేరింది. 

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స  పొందుతున్న వారిలో తాజాగా 1,17మంది రికవరీ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినుండి సురక్షితంగా బయటపడిన వారి సంఖ్య 2,06,105కి చేరింది. రాష్ట్రంలో కరోనా రోగుల రికవరీ రేటు 90.56శాతంగా వుంటే దేశంలో అది 89.2శాతంగా వుంది. 

గత 24గంటల్లో కరోనాతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1292కి చేరింది. మరణాల రేటు రాష్ట్రంలో 0.56శాతంగా వుంటే దేశంలో అది 1.5శాతంగా వుంది.  

జిల్లాల వారిగా చూసుకుంటే జిహెచ్ఎంసి(హైదరాబాద్)లో 254, రంగారెడ్డి 98, మేడ్చల్ 98, భద్రాద్రి కొత్తగూడెం 82, కరీంనగర్ 54, ఖమ్మం 89, నల్గొండ 92 కేసులు బయటపడ్డాయి. మిగతా జిల్లాల్లో కేసుల సంఖ్య తక్కువగా వున్నాయి.