హైదరాబాద్: గతకొన్ని నెలలుగా కరోనా కోరల్లో చిక్కుకున్న చిక్కుకున్న తెలంగాణ మెల్లిగా బయటపడుతోంది. గత 24 గంటల్లో 42,299 మందికి పరీక్షలు నిర్వహించగా కేవలం 1486మందికి మాత్రమే పాజిటివ్ గా తేలినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,24,545కు చేరుకోగా పరీక్షల సంఖ్య 38,98,829కి చురుకున్నాయి. 

ఇక ఇప్పటికే కరోనా బారిన పడినవారిలో 1,891మంది తాజాగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,02,577కు చేరింది. రాష్ట్రంలో 90.21శాతం రికవరీ రేటు నమోదవగా ఇది దేశంలో 88.6శాతంగా వుంది. 

READ MORE  ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 7, 86,050కి చేరిక

కరోనాతో గత 24గంటల్లో ఏడుగురు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1282కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.57శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 20,686 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

జిల్లాలవారిగా చూసుకుంటే జిహెచ్ఎంసీ(హైదరాబాద్) పరిధిలో అత్యధికంగా 235కేసులు బయటపడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం 98, కరీంనగర్ 69, ఖమ్మం 89, మేడ్చ్ 102, నల్గొండ 82, రంగారెడ్డి 112, వరంగల్ అర్బన్ 54 కేసులు భయటపడ్డాయి. మిగతా జిల్లాల్లో నామమాత్రంగానే కేసులు నమోదయ్యాయి.