తెలంగాణ కరోనా అప్ డేట్: గణనీయంగా తగ్గిన కేసులు, ఆ జిల్లాల్లో అయితే జీరో కేసులు
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గతకొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి.
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఇటీవల రోజురోజుకు కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గత 24గంటల్లో(శనివారం రాత్రి 8గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 17296 మందికి టెస్టుల చేయగా 502 పాజిటివ్ కేసులు బయట పడ్డాయి. దీంతో ఇప్పటివరకు చేసిన టెస్టుల మొత్తం సంఖ్య 48,91,729కి చేరగా కేసుల సంఖ్య 2,57,876కు చేరింది.
ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 1539 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,42,004కి చేరింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,385కి చేరింది.
read more తెలంగాణ కరోనా అప్ డేట్... భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు
ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1407కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 93.2శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 93.87శాతంగా వుంది.
జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే కొన్ని జల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదు. మహబూబ్ నగర్, నారాయణపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో కేసులవీ బయటపడలేదు. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 141కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 33, రంగారెడ్డి 72, భద్రాద్రి కొత్తగూడెం 23, కరీంనగర్ 22, ఖమ్మం 17, నాగర్ కర్నూల్ 11, నిజామాబాద్ 14, సంగారెడ్డి 26, సిద్దిపేట 21 కేసులు నమోదయ్యాయి.
పూర్తి వివరాలు: