తెలంగాణలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మెల్లిమెల్లిగా తగ్గుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో (శుక్రవారం రాత్రి 8గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 21264మందికి టెస్టులు చేయగా కేవలం 661మందికి మాత్రమే పాజిటివ్ గా తేలింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం టెస్టుల సంఖ్య 48,74,433కు చేరితే మొత్తం కేసుల సంఖ్య 2,57,374కు చేరింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 1637 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,40,545కి చేరింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,425కి చేరింది. 

 ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1404కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 93.3శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 93.46శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 167కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 45, రంగారెడ్డి 57, భద్రాద్రి కొత్తగూడెం 29, కరీంనగర్ 24, ఖమ్మం 19, నల్గొండ 34, వరంగల్ అర్బన్ 21, సంగారెడ్డి 28 కేసులు నమోదయ్యాయి. మిగతాజిల్లాలో కేసుల సంఖ్య కాస్త తక్కువగా వున్నాయి. 

పూర్తి వివరాలు:

Scroll to load tweet…