హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 46,835మందికి టెస్టులు చేయగా 1,708మందికి పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. తాజా టెస్టులలో  కలుపుని ఇప్పటివరకు జరిపిన టెస్టుల సంఖ్య 36,24,096కు చేరుకోగా కేసుల సంఖ్య 2,14,792కు చేరింది.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారిలో 2,009మంది రికవరీ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారినుండి సురక్షితంగా బయటపడ్డ వారి సంఖ్య 1,89,351కి చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 88.15శాతంగా వుంటే దేశంలో అది 86.8శాతంగా వుంది. 

read more  తనవల్లే కరోనా వచ్చిందంటూ...హోం క్వారంటైన్ లోనే భార్యను హతమార్చిన భర్త

గత 24గంటల్లో కేవలం ఐదుగురు మాత్రమే మృత్యువాతపడినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇలా కరోనా మరణాల సంఖ్య తగ్గుతూవస్తుండటం కాస్త ఊరటనిచ్చే అంశమే.  తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య  1233కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం మరణాల రేటు 0.57శాతంగా వుంటే దేశంలో ఇది1.5శాతంగా వుంది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 24,208 వున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

జిల్లాల వారిగా చూసుకుంటే జిహెచ్ఎంసీ(హైదరాబాద్) లో అత్యధికంగా 277, మేడ్చల్ 124, రంగారెడ్డి 137 కేసులు నమోదయ్యాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం 97, కరీంనగర్ 86, ఖమ్మం 81, నల్గొండ 81, నిజామాబాద్ 66, సిద్దిపేట 65, సూర్యాపేట 54, వరంగల్ అర్బన్ 61 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాలో కేసుల సంఖ్య తక్కువగానే వున్నాయి.