తెలంగాణలో కరోనా అప్ డేట్... తాజాగా 1717కేసులు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతూనేవుంది. గత 24గంటల్లో ఈ వైరస్ బారిన 1,717 మంది తెలంగాణ వాసులు పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,12,063కి చేరుకుంది.
ఇక ఇప్పటికే కరోనా బారిన పడ్డ వారిలో 2,103 మంది తాజాగా కోలుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకే కరోనా నుండి సురక్షితంగా బయటపడ్డవారి సంఖ్య 1,85,128కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర రికవరీ రేటు 87.29శాతంగా వుంటే దేశంలో అది 85.9శాతంగా వుంది.
ఇక ఈ వైరస్ బారినపడి చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1222కి చేరింది. మరణాలు రేటు రాష్ట్రంలో 0.57శాతంగా వుంటే దేశవ్యాప్తంగా అది 1.5శాతంగా నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటిచింది.
read more ఆ రెండు జిల్లాల్లో కరోనా ఉద్ధృతి: ఏపీలో ఏడున్నర లక్షలకు చేరిన కేసులు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 25,713 కేసులు వున్నట్లు అధికారులు వెల్లడించారు. గత 24గంటల్లో మొత్తం 46,657 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు చేపట్టిన మొత్తం పరీక్షల సంఖ్య 35,47,051కి చేరింది.
ఇక జిల్లాల వారిగా చూసుకుంటే జిహెచ్ఎంసీ(హైదరాబాద్)276, కరీంనగర్ 104, మేడ్చల్ 131, నల్గొండ 101, రంగారెడ్డి 132 కేసులు నమోదయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం 87, ఖమ్మం 82, నిజామాబాద్ 53, సంగారెడ్డి 59, సిద్దిపేట 85, సూర్యపేట 57, వరంగల్ అర్బన్ 59 కేసులు బయటపడ్డాయి. మిగతా జిల్లాలో కేసుల సంఖ్య తక్కువగానే వుంది.
పూర్తి వివరాలు: