ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 5,653 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 7,50,517కి చేరింది

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 5,653 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 7,50,517కి చేరింది. నిన్న ఒక్కరోజే వైరస్ కారణంగా 35 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 6,194కి చేరుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రస్తుతం రాష్ట్రంలో 46,624 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే 6,659 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 6,97,699కి చేరింది. గత 24 గంటల్లో 73,625 శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 64,94,099కి చేరుకుంది.

అనంతపురం 351, చిత్తూరు 706, పశ్చిమ గోదావరి 706, గుంటూరు 470, కడప 504, కృష్ణ 468, కర్నూలు 119, నెల్లూరు 322, ప్రకాశం 538, శ్రీకాకుళం 163, విశాఖపట్నం 289, విజయనగరం 194, పశ్చిమ గోదావరిలలో 823 కేసులు నమోదయ్యాయి.

అలాగే కోవిడ్ కారణంగా ప్రకాశం 6, చిత్తూరు 5, తూర్పుగోదావరి 4, కృష్ణ 4, నెల్లూరు 3, విశాఖపట్నం 3, అనంతపురం 2, గుంటూరు 2, కర్నూలు 2, పశ్చిమ గోదావరి 2, కడప, శ్రీకాకుళంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 

Scroll to load tweet…