ఆర్టీసిని మాకు ఇవ్వండి లాభాల్లోకి తెస్తాం : టిఎంయు

TMU rejects call off strike
Highlights

కేసిఆర్ కామెంట్స్ పై ఆగ్రహం

ఆర్టీసిని తమకు అప్పగిస్తే నాలుగేళ్లలో లాభాల్లోకి తెస్తామని స్పష్టం చేశారు టిఎంయు నేత అశ్వథ్థామరెడ్డి. శుక్రవారం సచివాలయంలో ట్రాన్స్ పోర్ట్ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆహ్వానం మేరకు టిఎంయు నేతలు చర్చలు జరిపారు. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు టిఎంయు నేతలు. సమ్మె వాయిదా వేసుకోవాలని మంత్రి ఆర్టీసి యూనియన్ నేతలకు సూచించారు. కానీ రేపు మధ్యాహ్నం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని కార్మిక సంఘం నేతలు చెప్పారు. ఇవాళ సాయంత్రం అన్ని యూనియన్లతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. రేపు మధ్యాహ్నం తమ నిర్ణయాన్న వెలువరిస్తామన్నరు. అసలు సమ్మె వాయిదా ప్రశ్నే లేదన్నారు. ఎన్నికల కోసమే యూనియన్లు సమ్మెకు కార్మికులను రెచ్చగొడుతున్నయన్న సిఎం మాటలను కొట్టిపారేశారు. ఈ సమ్మె చివరిది కావాలని తాము కూడా కోరుతున్నామని అన్నారు.  సమ్మెతో అన్న సమస్యలు పరిష్కారం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. తమ సంఘం గౌరవాధ్యక్షులు హరీష్ రావుకు తెలిసే తాము సమ్మెబాట పట్టామన్నరు. ఇప్పుడు చర్చలకు వచ్చిన సమయంలోనూ తాము హరీష్ కు చెప్పే చర్చలకు వచ్చినట్లు తెలిపారు.

ఎన్నికలు అన్నవి ప్రభుత్వం చేతిలో ఉంటాయని, ఎన్నికలు పెట్టకుండా ప్రభుత్వం ఆపే వెసులుబాటు ఉంటుందన్నారు. అవసరమైతే ఎన్నకలు రద్దు చేసుకోండి అన్నారు. తమకు డైరెక్టర్ పదవి అనేది టిష్యూ పేపర్ తో సమానమన్నారు. ఆర్టీసికి ప్రభుత్వం నుంచి రావాల్సిన  1529 కోట్లు మాకు వెంటనే ఇప్పించాలన్నారు.

loader