తెలంగాణ‌లో ఆర్టీసీ బిల్లుపై రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై సౌందర్‌‌రాజన్‌తో టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు ఈరోజు రాజ్‌భవన్‌ నుంచి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

తెలంగాణ‌లో ఆర్టీసీ బిల్లుపై రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై సౌందర్‌‌రాజన్‌తో టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు ఈరోజు రాజ్‌భవన్‌ నుంచి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ చర్చలు 10 మంది ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు. గవర్నర్‌తో చర్చల అనంతరం తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు థామస్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ తమ సమస్యలు విన్నారని.. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. అయితే గవర్నర్ తమిళిసై లేవనెత్తిన అభ్యంతరాలపై రాజ్‌భవన్‌కు ప్రభుత్వ వివరణ అందలేదని చెప్పారని తెలిపారు. ప్రభుత్వ వివరణ తర్వాత బిల్లును ఆమోదిస్తానని గవర్నర్ తెలిపినట్టుగా పేర్కొన్నారు. 

‘‘కార్మికులసంక్షేమం కోసమే ప్రశ్నలు లేవనెత్తినట్టుగా గవర్నర్ చెప్పారు. సుదీర్ఘమైన అంశాల గురించి చెప్పడం జరిగింది. మాకు సానుభూతి కూడా చెప్పారు. గతంలో సమ్మె విషయంలో కూడా ఆర్టీసీ కార్మికులకు సపోర్టు చేసిన విషయాన్ని ప్రస్తావించారని చెప్పారు. ఇప్పుడు కూడా మీకు సపోర్టు చేసేందుకే సిద్దంగా ఉన్నాను. గవర్నర్‌గా తన బాధ్యతలను పోషిస్తున్నట్టుగా చెప్పారు. కార్మికుల మంచి కోసమే ప్రభుత్వానికి పలు అంశాలపై డౌట్స్ లేవనెత్తినట్టుగా తెలిపారు. ఆ అంశాల్లో క్లారిటీ వస్తే తాను బిల్లుపై సంతకం చేసి పంపిస్తానని చెప్పారు. మాకు ఇబ్బంది చేయనని చెప్పారు. 

ప్రభుత్వంతో మేము మాట్లాడితే.. గవర్నర్ లేవనెత్తిన అంశాలకు సమాధానం పంపినట్టుగా తెలిపింది. అదే విషయాన్ని గవర్నర్‌కు తెలిపాం. అయితే గవర్నర్ ఆఫీసులో ఇంకా అందలేదని చెప్పారు. ఒకవేళ అందితే.. తక్షణమే సాయంత్రం అసెంబ్లీ సమావేశాలకు పంపించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే.. బిల్లులో రాసి దానిని ఆమోదించాలని మేము గవర్నర్‌ను కోరాం. అసెంబ్లీకి వెళ్లి మేము అక్కడ పాస్ చేపించుకుంటాం. తద్వారా మాకు ఇబ్బంది జరిగిందని కూడా చెప్పాం. ఆలస్యం జరిగితే తమ జీవితాలు అంధకారం అయిపోతాయని తెలిపారు. అయితే ఒక పదవిలో ఉన్నప్పుడు కొన్ని అంశాలపై క్లారిటీ తీసుకోవాల్సిన బాధ్యత తనపై ఉంటుందని గవర్నర్ చెప్పారు. సత్వరంగా పరిష్కారిస్తామని చెప్పినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు’’ అని థామస్ రెడ్డి పేర్కొన్నారు. 

ఆర్టీసీలో మెజారిటీ సంఘంగా తాము ఉన్నామని.. ప్రభుత్వాన్ని ఒప్పించి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేశామని చెప్పారు. కొంతమంది తమపై విమర్శలు చేస్తున్నారని.. అయితే వారిని తాము పిలవలేదని చెప్పారు. గతంలో సమ్మెను అశ్వథామరెడ్డి నాశనం చేశారని ఆరోపించారు. బిల్లుకు ఆమోదం లభిస్తుందనే నమ్మకం ఉందని.. కార్మికులు అంతా ఆశాభావంతో ఉండాలని చెప్పారు.