కరీంనగర్ లో కోదండరాం అరెస్ట్

First Published 31, May 2018, 12:58 PM IST
tjs kodandaram arrest in karimnagar
Highlights

హసన్ పర్తి పోలీసు స్టేషన్ కు తరలింపు

కరీంనగర్ లో కోదండరాం అరెస్ట్

తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం ను కరీంనగర్ లో పోలీసులు అరెస్టు చేశారు. సడక్ బంద్ కార్యక్రమంలో భాగంగా కోదండరాం  కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి వద్ద ఆందోళనలో పాల్గొన్నారు.

వారి ఆందోళనకు అనుమతి లేదని పేర్కొంటూ కరీంనగర్ పోలీసులు కోదండరాం ను, తెలంగాణ జన సమితి నేతలు గాదె ఇన్నయ్య, వెంకట్ రెడ్డితోపాటు సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు.

రైతు, వ్యవసాయ రంగ సమస్యలపై తెలంగాణ లోని రైతు సంఘాలు ఖమ్మం నుండి కరీం నగర్ సడక్ బంద్ కార్యక్రమం చేపట్టారు.

కోదండరాంతోపాటు జెఎసి, సిపఐ నేతలను అరెస్టు చేసి హసనపర్తి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు పోలీసులు.

loader