పోలీసు పోస్టులకు వయో పరిమితి పెంచాలి : జన సమితి

TJS demands to increase agae limit for police recruitments
Highlights

డిజిపికి వినతిపత్రం

తెలంగానలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాల్లో వయో పరిమితి పెంచాల్సిందేనని తెలంగాణ జన సమితి డిమాండ్ చేసింది. ఈ విషయమై తెలంగాణ జన సమితి సభ్యులు కపలివాయి దిలీప్ కుమార్, వెంకట్ రెడ్డి తదితరులు తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ లో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. ఇటీవల విడుదల చేసిన పోలీసు నోటిఫికేషన్ లో వయస్సు సడలింపు ఇవ్వలేదని, దీనివల్ల యువతకు తీవ్రమైన నష్టం కలుగుతుందన్నారు. తక్షణమే నిరుద్యోగులకు 6 సంవత్సరాల వయస్సు సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 6 సంవత్సరాల వయస్సు సడలిస్తూ..నోటిఫికేషన్ ను వెంటనే సవరించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో డిజిపి సానుకూలంగా స్పందించారని చెప్పారు.

loader