ప్రశాంత్ కిషోర్ పార్టీ వెనుక కేసీఆర్: టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్

ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీ వెనుక కేసీఆర్ ఉన్నారని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై సోమవారం నాడు ఆయన స్పందించారు.
 

TJS Chief Kodandaram Reacts On Prashant Kishor Political party

హైదరాబాద్: Prashant Kishor రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారనే ప్రచారంపై TJS  చీఫ్ ప్రొఫెసర్ Kodandaram స్పందించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రశాంత్ కిషోర్ ఇవాళ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంతేకాదు జాతీయ స్థాయిలో ఓ పార్టీని కూడా ప్రశాంత్ కిషోర్  ఏర్పాటు చేస్తారని ప్రచారం కూడా ప్రారంభమైంది. ఈ  విషయమై  తెలంగాణ జన సమితి చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పందించారు.

ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ వెనుక KCR ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్, ప్రశాంత్ కిషర్ పార్టీ ఒక్కటేననే అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించడానికి గాను ప్రశాంత్ కిషోర్ ను ఉపయోగించుకొంటున్నారని ఆయన ఆరోపించారు.

 ఇక నుంచి జన్‌ సురాజ్‌  దిశగా అడుగులు వేయనున్నట్లు ప్రశాంత్ కిషోర్ ఇవాళ ప్రకటించారు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక ఈ ట్వీట్‌తో ఆయన  ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు  ఖరారైంది. బీహార్‌ నుంచి తన ప్రయాణం మొదలుపెడుతున్నట్లు తెలిపారు.

గత నెలలో ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం పెద్ద ఎతున సాగింది. అయితే  కాంగ్రెస్ లో చేరడానికి ప్రశాంత్ కిషోర్ నిరాకరించారు.  ప్రాధాన్యత లేని పదవిని కాంగ్రెస్‌ ఆయనకు ఆఫర్‌ చేయడంతో పార్టీలో చేరే ఆలోచనను విరమించుకున్నట్లు ప్రచారం కూడా సాగింది.. ఒకప్పుడు రాజకీయ వ్యూహకర్తగా బీహార్‌లో నితీశ్‌కుమార్‌ను గద్దె ఎక్కించడంలో కీలక పాత్ర పోషించారు ప్రశాంత్‌ కిషోర్‌. ఇప్పుడు అక్కడి నుంచే ప్రత్యక్ష రాజకీయాలను ప్రారంభించనున్నట్టుగా ప్రకటించారు.


2014లో మోదీని ప్రధాని అభ్యర్థిగా జనసామాన్యం మెచ్చేలా చేయడంలో ప్రశాంత్ కిషోర్ కీలక భూమిక పోషించారు. మోదీ గద్దెనెక్కిన తర్వాత క్రమంగా బీజేపీకి దూరమైన ప్రశాంత్ కిషోర్ గడిచిన ఏడేళ్లలో అన్నీ బీజేపీయేతర పార్టీలకే సేవలందిస్తూ వచ్చారు. దేశంలోని భిన్న ప్రాంతాలు, భిన్న ఐడియాలజీలు కలిగిన పార్టీలతో పీకే పనిచేశారు. గతేడాది బెంగాల్ ఎన్నికల తర్వాత వ్యూహకర్త వృత్తిని పూర్తిగా మానేస్తున్నట్లు ప్రకటించిన ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోనే స్థిరంగా కొనసాగాలనే లక్ష్యాన్ని ప్రకటించారు.

2017-18 మధ్య కాలంలో జేడీయూలో పనిచేసిన పీకేను అనూహ్య పరిస్థితుల నడుమ పార్టీ అధిష్టానం బహిష్కరించింది. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిక దిశగా పీకే సుదీర్గ చర్చలు జరిపారు. చివరికి తాను ఆశించినట్లు జరక్కపోవడంతో పీకే.. కాంగ్రెస్ లో చేరిక అంశాన్ని పక్కనపెట్టేశారు. తాజాగా సొంత ప్రయాణం మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటన చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios