Asianet News TeluguAsianet News Telugu

టిక్ టాక్ కలిపిన బంధం: తప్పిపోయిన బధిర తండ్రి పిల్లల దగ్గరకు

పాపులర్ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ సంవత్సరం కింద దూరమైన తండ్రిని పిల్లలతో కలిపింది. పంజాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి కరోనా కాలంలో పోలీసులు చేస్తున్న సహాయాన్ని షూట్ చేసి టిక్ టాక్ లో పోస్ట్ చేసాడు. ఆ టిక్ టాక్ వీడియో వైరల్ గా మారి భద్రాద్రి కొత్తగూడెం లో ఉంటున్న వారికుటుంబ సభ్యుల కంట పడింది. వెంటనే అక్కడకు వెళ్లిన వారి కొడుకు తమ తండ్రిని కలుసుకున్నాడు. అక్కడి నుండి తన తండ్రిని తీసుకొని సొంతఊరికి పయనమయ్యాడు. 

TikTok Clip Helps Reunite Disabled Dad And Kids
Author
Hyderabad, First Published May 24, 2020, 5:29 PM IST

ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ సంవత్సరం కింద దూరమైన తండ్రిని పిల్లలతో కలిపింది. పంజాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి కరోనా కాలంలో పోలీసులు చేస్తున్న సహాయాన్ని షూట్ చేసి టిక్ టాక్ లో పోస్ట్ చేసాడు. 

ఆ టిక్ టాక్ వీడియో వైరల్ గా మారి భద్రాద్రి కొత్తగూడెం లో ఉంటున్న వారికుటుంబ సభ్యుల కంట పడింది. వెంటనే అక్కడకు వెళ్లిన వారి కొడుకు తమ తండ్రిని కలుసుకున్నాడు. అక్కడి నుండి తన తండ్రిని తీసుకొని సొంతఊరికి పయనమయ్యాడు. 

వివరాల్లోకి వెళితే... ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు పుట్టు మూగ, చెవిటి వాడు. రోజు కూలీగా పనిచేస్తూ సంసారాన్ని సాగదీస్తున్నాడు. 2018 ఏప్రిల్ 27న పనుంది బయటకు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిన వ్యక్తి మరల ఇంటికి తిరిగిరాలేదు. 

ఆనాటి నుండి తండ్రి కోసం కూతురు కనకదుర్గ, కొడుకు పెద్దిరాజు వెతుకుతూనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తరువాత పంజాబ్ పోలీస్ డిపార్ట్మెంట్, లుధియానాలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వ్యక్తి టిక్ టాక్ లో పెట్టిన వీడియోలో వెంకటేశ్వర్లు కనపడ్డాడు. 

అలా ఊర్లో వాళ్ళు ఆ వీడియోలో ఉన్నది వెంకటేశ్వర్లు అని అనుమానం వచ్చి వారి పిల్లలకు చూపించారు. అతను తమ తండ్రే అవడంతో వారు ఎగిరి ఆనందంతో గంతేసి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. 

భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ నుంచి మొదలు బూర్గంపాడు ఎస్సై బాలకృష్ణ వరకు అందరూ కూడా ఆ టిక్ టాక్ లో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని కనుగొనేందుకు సహాయం చేసారు. అలా ఎంక్వయిరీ చేస్తూ చేస్తూ ఆ టిక్ టాక్ లో వీడియో పోస్ట్ చేసిన అకౌంట్ పంజాబ్ పోలీసు డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ది అని తెలుసుకున్నారు. 

ఆ వెంటనే సదరు లుధియానా లో ఉన్న కానిస్టేబుల్ తో మాట్లాడి ఆ వ్యక్తి వెంకటేశ్వరులే అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వీడియో కాల్ కూడా చేసారు. అతడు వెంకటేశ్వర్లు అని తేలగానే జిల్లా పోలీసులు అతడికి పాస్ తో పాటుగా అక్కడివరకు వెళ్లి రావడానికి ఒక వాహనాన్ని కూడా సమకూర్చారు. 

21వ తారీఖున పంజాబ్ బయల్దేరిన పెద్ది రాజు తన తండ్రిని కలుసుకున్నాడు. అక్కడి నుండి నేడు ఇంటికి తిరుగు పయనమయ్యాడు. మరో రెండు రోజుల్లో బూర్గంపాడు చేరుకోనున్నారు ఆ తండ్రి కొడుకులు. 

Follow Us:
Download App:
  • android
  • ios