ఆసిఫాబాద్ జిల్లా ఖానాపూర్‌లో ఓ వ్యక్తిపై దాడి చేసిన పులి అతన్ని చంపేసింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో ఓ వ్యక్తిని పులి చంపింది . ఖానాపూర్ సమీపంలో దాడి చేసిన పులి .. అడవిలోకి లాక్కెళ్లింది. మృతుడు ఖానాపూర్‌కు చెందిన భీముగా గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు సైతం ఈ ఘటనను ధ్రువీకరించారు. పులి దాడిలోనే అతను చనిపోయినట్లు తెలిపారు. అయితే ఈ ఏరియాలో గత కొన్నిరోజులుగా పులి తిరుగుతోంది. పశువులపై దాడులు చేస్తూ వస్తోన్న పులి.. ఇవాళ ఏకంగా మనిషిని చంపడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న అటవీ, పోలీస్ శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. రెండేళ్ల క్రితం దిగిడలో ఓ వ్యక్తిని పులి చంపేసిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. పులి కోసం అప్పుడు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

