కులమతాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేశానని టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. గ్రామాల నుంచి సమస్యల కోసం నా దగ్గరకు రానివ్వడం లేదని.. ప్రజా సమస్యలు తన చెవికి వినబడితే చాలు అవి పూర్తి చేసే శక్తిని భగవంతుడు నాకు ఇచ్చాడని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
టీఆర్ఎస్ (trs) సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (thummala nageswara rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఖమ్మం జిల్లా గా (khammam district) పాలేరు నియోజకవర్గంని చూశానని అన్నారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేశానని తుమ్మల పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో మీ ఆశీస్సులతో ఉప ఎన్నికలో గెలుపొందిన మీ నియోజకవర్గంలోని గ్రామాల ముఖచిత్రాన్ని మార్చేశానని నాగేశ్వరరావు తెలిపారు.
టిఆర్ఎస్ పార్టీ వల్లే తన పేరు మరింత పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలోనే పది నియోజకవర్గాలను అభివృద్ధి చేసి.. గత 40 ఏళ్లుగా అభివృద్ధి కోసం మాత్రమే రాజకీయం చేశానని తుమ్మల చెప్పారు. రాజకీయం కోసం తాను రాజకీయం చేయలేదని.. నియోజకవర్గంలో అన్ని విధాల ప్రభుత్వ పథకాలను అమలు చేసి నియోజకవర్గ ప్రజల అవసరాలను తీర్చానని నాగేశ్వరరావు వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధితో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. గ్రామాల నుంచి సమస్యల కోసం నా దగ్గరకు రానివ్వడం లేదని.. ప్రజా సమస్యలు తన చెవికి వినబడితే చాలు అవి పూర్తి చేసే శక్తిని భగవంతుడు నాకు ఇచ్చాడని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భవిష్యత్‌లో కూడా మళ్లీ మీ ముందుకువస్తానని తుమ్మల సంచనల ప్రకటన చేశారు.
గతేడాది కూడా తమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని నాశనం చేయాలని కొందరు చూశారని.. ఒక చోట ఉండి మరో చోట కాపురం చేయడం మంచిది కాదని ఆయన పరోక్షంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నేతలకు చురకలంటించారు. ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు.భవిష్యత్తులో అందరూ కలిసి పనిచేయాలన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు అశ్వారావుపేట అభివృద్ధి విషయంలో ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు వేశానని ఆయన గుర్తు చేసుకొన్నారు. భారతదేశంలో ఫామ్ ఆయిల్ హబ్‌గా అశ్వారావుపేట దమ్మపేట మండలాలు ఉండబోతున్నాయన్నారు.అశ్వారావుపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎక్కడ జరగలేదన్నారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు.
