Asianet News TeluguAsianet News Telugu

ఇదే టి హబ్ 2 నమూనా

  • ట్విటర్ వేదికగా ప్రకటించిన కేటీఆర్
thub2

సాంకేతికత, నవకల్పనలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో దూసుకెళ్లేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా భారీ స్థాయిలో టీ హబ్ కు రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. దేశవిదేశాల నుంచి కూడా ఈ టీ హబ్ కు మంచి పేరే వచ్చింది. దీంతో సరికొత్త ఉత్సాహంతో ఈ సారి ప్రపంచంలో భారీ స్థాయిలో అతి పెద్ద హబ్ ను నిర్మించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. టీ హబ్ 2 పేరుతో ఇప్పడికే ఈ ప్రాజెక్టును రూపొందించింది. దీని భవన నమూనాను ఐటీ మంత్రి కేటీఆర్ తాజాగా ట్విటర్లో పోస్టు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద టీ హబ్ ను నిర్మించనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

టీ-హ‌బ్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలంగాణ ప్ర‌త్యేక స్థానాన్ని సంత‌రించుకుంది. స్టార్ట్ అప్స్‌కు ఇంక్యూబేట‌ర్‌గా టీ హ‌బ్ అగ్ర స్థానంలో దూసుకెళ్లుతుంది. సామాన్య పౌరుడి అవ‌స‌రాలు తీర్చితేనే టెక్నాల‌జీకి విలువ ఉన్న‌ట్లు ఇంట‌ర్నెట్ మీట్ స‌ద‌స్సులో మంత్రి కేటీఆర్ పేర్కొన్న‌డం దీనికి నిద‌ర్శ‌నం. సైబ‌ర్ నేరాల‌ను అడ్డుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప‌టిష్ట‌మైన సెబ‌ర్ సెక్యూర్టీ పాల‌సీని కూడా రూపొందించింది. ఇంట‌లెక్ట్యువ‌ల్ ప్రాప‌ర్టీ క్రైమ్ యూనిట్‌ను ప్రారంభించ‌డం వ‌ల్ల రాష్ట్రం ఇంటెర్నెట్‌కు ఇస్తున్న ప్రాముఖ్య‌త స్ప‌ష్ట‌మ‌వుతుంది. టీహ‌బ్ కోసం ఏడాది క్రితం రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ ఆఫీసును నిర్మించింది. అక్క‌డే ఆ నిర్మాణం కంటే నాలుగు రేట్లు పెద్ద‌దైన బిల్డింగ్‌ను క‌ట్టేందుకు ప్ర‌భుత్వం నిశ్చ‌యించింది. టీ-హ‌బ్‌-2 కోసం త్వ‌ర‌లో సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న కూడా చేయ‌నున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios