షాక్: హాస్టల్‌ నుండి ముగ్గురు విద్యార్థుల అదృశ్యం

First Published 30, Jul 2018, 1:36 PM IST
three students disappears from hostel in Adilabad district
Highlights

ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలోని అనాధ ఆశ్రమం నుండి ముగ్గురు విద్యార్థులు  అదృశ్యమయ్యారు.  ఈ నెల 24వ తేదీ నుండి ఈ ముగ్గురు విద్యార్ధులు అదృశ్యమయ్యారు. 


ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలోని అనాధ ఆశ్రమం నుండి ముగ్గురు విద్యార్థులు  అదృశ్యమయ్యారు.  ఈ నెల 24వ తేదీ నుండి ఈ ముగ్గురు విద్యార్ధులు అదృశ్యమయ్యారు. అయితే  ఈ విషయమై ఆశ్రమ నిర్వాహకులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదుపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంపూర్ణ చంద్ర గ్రహణం రోజునే ముగ్గురు విద్యార్ధులు అదృశ్యం కావడంతో  పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  అనాధ ఆశ్రమం నుండి విద్యార్ధులు కాలకృత్యాలు తీర్చుకొనేందుకు బయటకు వెళ్లి  కన్పించకుండా పోయారు.

ఈ విషయాన్ని గుర్తించిన ఆశ్రమ సిబ్బంది పోలీసులకు  ఫిర్యాదు చేశారు.  పోలీసులు అదృశ్యమైన విద్యార్ధుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  అసలు విద్యార్ధులు ఆశ్రమం నుండి తప్పించుకొని ఇంటికి వెళ్లారా... ఇంకా ఎక్కడికైనా వెళ్లారా.. లేదా ఎవరైనా ఆ విద్యార్ధులను కిడ్నాప్ చేశారా అనే కోణాల్లో  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆశ్రమ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు టీమ్‌లను ఏర్పాటు చేసి విద్యార్ధుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  అసలు విద్యార్ధులు ఎలా అదృశ్యమయ్యారనే దానిపై  ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
 

loader