వనితారెడ్డి కోసం పోలీసు వేట షురూ

వనితారెడ్డి కోసం పోలీసు వేట షురూ

సినిమా కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈనెల 11న విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదన్న విమర్శలు వచ్చాయి. ఈ కేసులో ఒక బడా పారిశ్రామికవేత్త కూడా ఇన్వాల్వ్ అయినట్లు ఆరోపణలున్నాయి.

ఈ విమర్శలకు పోలీసులు చెక్ పెట్టేందుకు వేట మొదలు పెట్టారు. పారిపోయిన వనితారెడ్డిని అరెస్టు చేసేందుకు బంజారాహిల్స్ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి వేట మొదలు పెట్టాయి.

విజయ్ సాయి ఆత్మహత్య తర్వాత అత్యంత వేగంగా వనతిరెడ్డి తెర మీదకు వచ్చింది. విజయ్ సాయి ఆత్మహత్యకు విజయ్ భార్య వనితారెడ్డితోపాటు, నవయుగ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ శశిధర్ తోపాటు అడ్వకెట్ వీరు ముగ్గురు కీలక పాత్ర పోశించారని కమెడియన్ తండ్రి ఆరోపించారు.  ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

అయితే విజయ్ సాయి ఆత్మహత్యకు తన ప్రమేయం ఏమాత్రం లేదని జనాలను, పోలీసులను వనితారెడ్డి నమ్మించే ప్రయత్నం చేశారు. విజయ్ ఆత్మహత్య జరిగిన కొద్దిసేపట్లోనే ఆమె మీడియా ముందుకు వచ్చి విజయ్ సాయికి అక్రమ సంబంధం ఉందని, తాను కళ్లారా చూశానని చెప్పారు.

అయితే ఆమె వ్యవహారం మాత్రం అననుమానాలను రేకెత్తించింది. విజయ్ అంత్యక్రియలకు కూడా వనితారెడ్డి హాజరు కాలేదు. దీంతో పోలీసులు ఆమె తీరును నిశితంగా గమనించారు. తాజాగా మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగడంతో వనితారెడ్డిని కొద్ది వ్యవధిలోనే అరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇక శశిధర్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. విజయ్ సాయి సెల్పీ వీడియోను పోలీసులు ఇంకా బహిర్గతం చేయకపోవడం వెనుక కూడా అనేక అనుమానాలు వస్తున్న పరిస్థితి ఉంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page