అత్తాపూర్‌లో పట్టపగలు రమేష్ అనే యువకుడిని దారుణంగా హత్య చేసే సమయంలో నిందితుల నుండి రమేష్ ను రక్షించేందుకు ముగ్గురు తీవ్రంగా ప్రయత్నించారు


హైదరాబాద్: అత్తాపూర్‌లో పట్టపగలు రమేష్ అనే యువకుడిని దారుణంగా హత్య చేసే సమయంలో నిందితుల నుండి రమేష్ ను రక్షించేందుకు ముగ్గురు తీవ్రంగా ప్రయత్నించారు.

అత్తాపూర్‌లో రమేష్ అనే యువకుడిని బుధవారం నాడు మహేష్ గౌడ్ తండ్రి అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్య జరిగే సమయంలో ముగ్గురు వ్యక్తులు రమేష్ ను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడే ప్రయత్నం చేశారు.

రమేష్‌పై హత్య జరిగే సమయంలో అక్కడే విధులను నిర్వహిస్తున్న కానిస్టేబుల్ లింగమూర్తి ఈ హత్యను నిలువరించేందుకు ప్రయత్నించారు. రమేష్ ను రక్షించేందుకు లింగమూర్తి తన బైక్‌పై రమేష్ ను తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. అయితే లింగమూర్తి చేసిన కృషి వృధాగా మారింది. లింగమూర్తి రమేష్‌ను రక్షించేందుకు చేసిన కృషిని పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలతో ముంచెత్తారు.

అయితే రమేష్‌పై దాడి చేసే సమయంలో ఓ వ్యక్తి రెండు దఫాలు నిందితుడిని గట్టిగా పట్టుకొని దాడిని అడ్డుకొనే ప్రయత్నం చేశాడు. అంతేకాదు మరో యువకుడు రమేష్‌ను గొడ్డలితో నరకుతున్న నిందితుడిని వెనుక నుండి తన్నాడు. మరో యువకుడు రమేష్‌కు నిందితుడికి మధ్య వెళ్లి గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. 

సంబంధిత వార్తలు

అత్తాపూర్ మర్డర్: 'కొడుకా.. నీ వద్దకే రమేష్‌ను పంపా'

10 నెలల క్రితం కొడుకు హత్య: అత్తాపూర్ మర్డర్ వెనుక కారణమిదే(వీడియో)

అత్తాపూర్‌ మర్డర్: వివాహితతో అఫైర్ వల్లనే అప్పుడు మహేష్, ఇప్పుడు రమేష్...