జనగామ: వేసవి సెలవులు కావడంతో బావ తన మదరళ్లతో కలిసి రిజర్వాయర్ ను చూసేందుకు వెళ్లారు. వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు మరదలితో కలిసి రిజర్వాయర్ లో దిగారు. సరదగా వారిని ఆటపట్టించారు. 

సెల్ఫీ తీసుకుందామంటూ మరదళ్లు ఒత్తిడి చేయడంతో వెనక్కి వెళ్లి రిజర్వాయర్ లో మునిగి ముగ్గురు చనిపోయారు. ఈ విషాద ఘటన జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ వద్ద చోటు చేసుకుంది. రఘునాథ పల్లి మండలం జీవి తండాకు చెందిన అవినాష్ ఇటీవలే భార్గవిని వివాహం చేసుకున్నారు. 

వీకెండ్ కావడంతో తన మరదళ్లు సంగీత, సుమలతతో కలిసి బర్మెట్ట రిజర్వాయర్ ను చూసేందుకు వెళ్లారు. తొలుత అవినాష్ తన మరదల్లు అయిన సంగీత, సుమలతతో కలిసి రిజర్వాయర్ లో దిగారు. తన భర్త, చెల్లెళ్లు సరదాగా ఆటలు ఆడుతుండగా భార్య భార్గవి రిజర్వాయర్ పై ఉండి వీడియో చిత్రీకరిస్తున్నారు. 

అయితే సరదా సరదాగా వారు లోతులో కి వెళ్లిపోయారు. దీంతో ఆ ముగ్గురు జలసమాధి అయిపోయారు. కళ్లెదుటే భర్త, ఇద్దరు చెల్లెల్లు జలసమాధి కావడంతో భార్గవి పెద్ద ఎత్తున కేకలు వేసింది. ఇంతలో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేశారు. 

అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇకపోతే భార్గవి తన భర్త  అవినాష్ తో కలిసి హైదరాబాద్ లో ఉంటుంది. అవినాష్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వీకెండ్ కావడంతో శుక్రవారం రాత్రి అత్తవారిళ్లు అయిన జీవితండాకు చేరుకున్నారు. 

సరదాగా గడుపుదామని వచ్చి ఇలా విగతజీవిగా మారడంతో కుటుంబం తల్లడిల్లిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు జలసమాధి కావడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. 

"