తెలుగు అకాడమీ స్కాం.. నిర్లక్ష్యమే కారణం, అకౌంట్స్ ఆఫీసర్ నుంచి డైరెక్టర్ వరకు బాధ్యులే: త్రిసభ్య కమిటీ

తెలుగు అకాడమీ (telugu academy scam ) నిధుల గోల్‌మాల్ కేసులో త్రిసభ్య కమిటీ (three member committee) నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అధికారుల నిర్లక్ష్యమే నిధుల గోల్‌మాల్‌కు కారణమని కమిటీ తేల్చింది

three member committee report on telugu academy scam

తెలుగు అకాడమీ (telugu academy scam ) నిధుల గోల్‌మాల్ కేసులో త్రిసభ్య కమిటీ (three member committee) నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అధికారుల నిర్లక్ష్యమే నిధుల గోల్‌మాల్‌కు కారణమని కమిటీ తేల్చింది. నివేదిక, కీలక అంశాలను కమిటీ పరిశీలించింది. అకౌంట్స్ ఆఫీసర్ నుంచి డైరెక్టర్ (telugu academy Director) వరకు అందరూ బాధ్యులేనని కమిటీ వెల్లడించింది. కుంభకోణంలో తెలుగు అకాడమీ అధికారుల పాత్ర లేకపోయినప్పటికీ నిర్లక్ష్యం కనిపిస్తోందని అభిప్రాయపడింది. బాధ్యులపై క్రిమినల్ చర్యలే కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. అకౌంట్స్, డిపాజిట్ల విషయంలో రెగ్యులర్ ఆడిటింగ్ జరగాలని సిఫారసు చేసింది. తెలుగు అకాడమీకి పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించాలని సూచించింది. ప్రభుత్వ సంస్థల డిపాజిట్లపై రెగ్యులర్ మానిటరింగ్ వుండాలని తెలిపింది. 

అంతకుముందు తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో ఆరుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీతో కలిసి ఈ ముఠా ఫిక్స్‌డ్ డిపాజిట్లను కాజేసింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు.. తాజాగా మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి కొంత మొత్తాన్ని పోలీసులు రికవరీ చేసినట్లుగా తెలుస్తోంది. వీరు కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంకులలో వున్న తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రూ.64 కోట్లను కాజేసినట్లు సీసీఎస్ విచారణలో తేలింది. 

ALso Read:తెలుగు అకాడమీ స్కాం: మరో ఆరుగురి అరెస్ట్.. స్వల్పంగా సొమ్ము రికవరీ

ఈ కేసులో నిందితులను ఈ రోజు పోలీసు కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్ట్ (Nampally Court). యూనియన్ బ్యాంక్ (Union Bank) మేనేజర్ మస్తాన్‌వలీ (Mastanvali)ని కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం . అయితే రేపటి నుంచి ఈ నెల 12 వరకు కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో వున్న మస్తాన్‌వలీని రేపు సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మరో ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది. 

ఈ కేసులో యుబిఐ మేనేజర్ గా ఉన్న మస్తాన్ వలీ, సత్యనారాయణ, పద్మావతి, మొహియుద్దీన్ లను అరెస్టు చేశారు. మరో కీలక నిందితుడు రాజ్ కుమార్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మాయమైన మొత్తాలు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనే విషయం తెలియడం లేదు. నిందితుల ఖాతాల్లో కూడా డబ్బులు లేవని తెలుస్తోంది. దీంతో ఆ నిధులు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనే విషయాన్ని తేల్చడానికి ప్రయత్నిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios