హైద్రాబాద్ దోమలగూడ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో ఇవాళ మరో ముగ్గురు మృతి చెందారు.  ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరుకుంది.

హైదరాబాద్: నగరంలోని దోమలగూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో శుక్రవారంనాడు మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 12వ తేదీన చిన్నారి శరణ్య మృతి చెందింది. ఇవాళ నాగమణి, ధనలక్ష్మి, అభి మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి కూడ విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అగ్ని ప్రమాదానికి గ్యాస్ లీక్ కావడమే కారణంగా అధికారులు గుర్తించారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ను డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కు ఉపయోగించడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.