Asianet News TeluguAsianet News Telugu

5 ఫోటోలు.. 5 కోట్లు: క్రైమ్ స్టోరీలతో ప్లాన్, ఆ 'మచ్చ' తో వినీత్‌‌కు అనుమానం

ప్రేమ పేరుతో యువతిని నమ్మించి ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో  తీసిన ఫోటోలతో రూ. 5 కోట్లు డిమాండ్ చేసిన వీనీత్ ను విచారించిన  పోలీసులు విస్తుపోయే వాస్తవాలను రాబట్టారు

three held in hyderabad for threatening to circulate girl's intimate photos
Author
Hyderabad, First Published Aug 22, 2018, 12:49 PM IST


హైదరాబాద్: ప్రేమ పేరుతో యువతిని నమ్మించి ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో  తీసిన ఫోటోలతో రూ. 5 కోట్లు డిమాండ్ చేసిన వీనీత్ ను విచారించిన  పోలీసులు విస్తుపోయే వాస్తవాలను రాబట్టారు.  టీవీల్లో వచ్చే క్రైమ్ కథనాలను చూసీ  తన్ ప్రియురాలి తండ్రి వద్ద  రూ. 5 కోట్లు కొట్టేయాలని ప్లాన్ చేశాడు.  సినీ ఫక్కీలో వీనీత్ ను ఛేజ్ చేసి పోలీసులు పట్టుకొన్నారు.

హైద్రాబాద్‌లోని ప్రముఖ కాలేజీలో  ప్రముఖ వ్యాపారవేత్త కూతురు  డిగ్రీ ప్రథమ  సంవత్సరం చదువుతోంది.ఇదే కాలేజీలో  చదివే వీనీత్  ఆమెను లవ్ చేస్తే  కోట్లాది రూపాయాలను సంపాదించవచ్చని ప్లాన్ చేశాడు.  ఈ ప్లాన్ మేరకు ఆ  యువతిని  ప్రేమ పేరుతో నమ్మించాడు.

ప్రేమ పేరుతో నమ్మించాడు.దీంతో ఆ యువతి అతడితో చనువుగా ఉంది. తనతో ఆ యువతి చనువుగా ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా వీనీత్ 5 ఫోటోలు తీశాడు.ఈ ఫోటోలను పోర్న్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. ఇదే విషయమై తన ప్రియురాలి తండ్రికి చెప్పి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడు.

రూ.5 కోట్లను ప్రియురాలి తండ్రిని డిమాండ్ చేశాడు. అయితే  రూ.కోటి ఇస్తానని ఆ వ్యాపారి ఒప్పుకొన్నాడు. ఇందులో భాగంగానే రూ. 25 లక్షలు ఇస్తానని వీనీత్ కు చెప్పాడు. ఈ డబ్బులు తీసుకొనే క్రమంలో సినిమాల్లో చూపినట్టుగా  వీనీత్ ప్లాన్ చేశాడు.

వీనీత్ ఇద్దరు స్నేహితులను  కొంపల్లి లో డబ్బులు తీసుకోవాలని చెప్పాడు.  వీనీత్ మాత్రం మెదక్ జిల్లా తూఫ్రాన్‌లో ఉన్నాడు. అక్కడి నుండే  అతను  తన ఇద్దరు స్నేహితులకు సూచనలు ఇచ్చాడు. 

వ్యాపారవేత్త కారు డిక్కీలో ఎస్సై మదన్ కూడ ఉన్నాడు.  కొంపల్లి వద్ద డబ్బులు తీసుకొనే సమయంలో పట్టుకొందామని  ఎస్సై మదన్ భావించాడు. అయితే  నేరుగా కొంపల్లికి రమ్మనకుండా సుచిత్ర వద్దకు రమ్మని చెప్పారు. సుచిత్ర వద్ద వ్యాపారవేత్త నుండి డబ్బులు తీసుకొంటున్న  గణేష్, మహేష్‌లను ఎస్ఐ మదన్ పట్టుకొన్నాడు.

నిందితులిద్దరికీ పోలీసు స్టైల్‌లో విచారణ జరిపితే  వీనీత్ చెబితే తాము  డబ్బులు తీసుకొనేందుకు వచ్చామని చెప్పారు. అయితే  వీనీత్ ఎప్పుడూ ఫోన్ చేసినా  'మచ్చ' అంటూ గణేష్ సంబోదిస్తాడు.  అయితే సుచిత్ర వద్ద పోలీసుల విచారణ కారణంగానో, లేక భయంతోనో గణేష్ అన్నా అంటూ వీనీత్ ను పిలిచాడు. 

దీంతో వీనీత్ కు అనుమానం వచ్చింది. పోలీసులకు దొరికావా అంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలో ఎస్సై మదన్  చెప్పినట్టుగానే  గణేష్ ఫోన్‌లో మాట్లాడాడు. అయితే రామాయంపేట వైపుకు రావాలని వీనీత్ గణేష్‌కు సూచించాడు. 

గణేష్ వెనుక హెల్మెట్ పెట్టుకొని  ఎస్సై మదన్ ఉన్నాడు.హైద్రాబాద్ నుండి కామారెడ్డి వైపు  గణేష్‌ను రమ్మన్నాడు. ఓ దాబా వద్ద భోజనం చేస్తున్నట్టు  గణేష్ అతని స్నేహితుడు మహేష్‌లను కూర్చోపెట్టాడు ఎస్ఐ మదన్.

తన టీమ్‌తో ఎస్సై మదన్ వేరే చోట కాపుకాశాడు. దాబా వద్ద ఇధ్దరు స్నేహితులు మాత్రమే ఉన్నారని భావించిన వీనీత్ గణేష్‌ను ఒక్కడినే దాబా బయటకు రావాలని కోరారు.  డబ్బు సంచితో గణేష్ బయటకు రాగానే రోడ్డుకు అవతలివైపున ముళ్లపొదల్లో నక్కి ఉన్న వీనీత్ డబ్బు సంచి తీసుకొని పారిపోయాడు. 

ఆ సమయంలో ఎస్సై మదన్ అక్కడే ఉన్న స్థానికుడి సహాయంతో బైక్ పై వీనీత్ ను వెంటాడాడు.  ఎట్టకేలకు కామారెడ్డి సమీపంలో వీనీత్ ను అరెస్ట్ చేశారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గాను తాను  టీవీల్లో వచ్చే  క్రైమ్ స్టోరీలను ఫాలో అయ్యాయని వినీష్ చెప్పాడు. ఈ విషయం విన్న పోలీసులు షాక్ తిన్నారు.

ఈ వార్త చదవండి

బ్లాక్‌మెయిల్ : 5 ఫోటోలకు రూ.5 కోట్లు, ప్రియుడికి ప్రేయసి షాక్

 


 

Follow Us:
Download App:
  • android
  • ios