భార్యకు మరో వ్యక్తితో అఫైర్: హత్యకు పాల్పడిన భర్త

Three held for murder in Mahabubnagar
Highlights

భార్యకు అఫైర్ ఉందని హత్య

కోస్గి:భార్యతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో గన్నోజు రాము అనే వ్యక్తిని  
ఇధ్దరు వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు పాల్పడిన  ఇద్దరు
నిందితులతో పాటు ఈ కుట్రలో భాగస్వామ్యం ఉన్న హోంగార్డును కూడ పోలీసులు
అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉమ్మడి మహాబూబ్ నగర్  జిల్లా కోస్గిలో చోటు చేసుకొంది.

వరంగల్ జిల్లా వడ్డేపల్లికి చెందిన గన్నోజు రాము అనే వ్యక్తి ఓ స్వచ్చంధ సంస్థలో
ప్రోగ్రామ్ అధికారిగా కోస్గిలో పనిచేస్తు్నాడు.అదే కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా
పనిచేస్తున్న మహిళతో రాముకు వివాహేతర సంబంధం ఉందని వివాహిత భర్త  
వెంకటయ్య అనుమానించాడు. దీంతో రామును హత్య చేయాలని ప్లాన్ చేశాడు.


ఈ విషయమై తన స్నేహితుడైన  హోంగార్డుగా పనిచేస్తున్న బంటు నర్సింహులుతో పాటు
మరో స్నేహితుడు సంతు అలియాస్ శాంతిలతో చర్చించారు.మే 30వ తేదిన ఈ ముగ్గురు
కోస్గి పట్టణంలో కలుసుకొన్నారు.తమ వెంట వేటకొడవళ్ళను తెచ్చుకొన్నారు. అయితే
అదే సమయానికి తనకు వేరే పని ఉందని  హోంగార్డు బంటు నర్సింహులు
వెళ్ళిపోయాడు.

రాము వద్దకు వచ్చిన వెంకటయ్య తన భార్య తన మాట వినడం లేదని నచ్చజెప్పాలని
రామును ఆఫీసు నుండి తన ద్విచక్రవాహనంపై తీసుకొచ్చాడు. కొంత దూరం తీసుకెళ్ళిన  
తర్వాత వెంకటయ్య స్నేహితుడు కూడ వారికి కలిశాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి
అక్కడ రాముతో వారిద్దరూ గొడవకు దిగారు. సరిగ్గా అదే సమయంలో రాముకు వారి
కార్యాలయం నుండి లక్ష్మణ్ అనే ఉన్నతాధికారి ఫోన్ చేశాడు. అయితే తనతో ఇద్దరు
వ్యక్తులు గొడవపడుతున్నారని రాము చెప్పాడు. ఆ తర్వాత లక్ష్మణ్ ఫోన్ చేసే సమయానికి
రాము పెద్దగా అరుపులు ఫోన్ లో విన్న లక్ష్మణ్ కోస్గిలో పనిచేస్తున్న మరో ఉద్యోగి
రాఘవేందర్ గౌడ్ కు సమాచారమిచ్చి అతడిని అక్కడికి వెళ్ళి చూడాలని కోరగా అప్పటికే
రాము చనిపోయాడు.

రాము తన భార్యతో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నాడని భావించి అతడిని హత్య
చేసినట్టుగా విచారణలో వెల్లడించినట్టుగా వెంకటయ్య చెప్పాడని ఎస్పీ అనురాధ
చెప్పారు.


 

loader