ఆసిఫాబాద్: కుమ్రం భీమ్ జిల్లాలోని ఆసిఫాబాద్ దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఉంటున్న ముగ్గురు విద్యార్థినులు గర్భం దాల్చినట్లు వెలుగు చూసింది. విషయం తెలిసిన బాలికల తల్లిదండ్రులు ఆ వ్యవహారంపై ఐటీడీఏ పివోకు ఫిర్యాదు చేశారు.

సంఘటనపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. హాస్టల్లో ఉంటూ వారు మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. తెలంగాణ గిరిజన వెల్ఫేర్ రెసిడెంట్ డిగ్రీ కళాశాల వసతి గృహానికి సంబంధించిన పది మంది విద్యార్థినులకు రుతుస్రావం రాకపోడంతో హాస్టల్ సిబ్బంది అనుమానించారు. 

ఆ బాలికలను రిమ్స్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు సంచలన విషయం బయటపెట్టారు.పది మందిలో ముగ్గురు అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ టెస్టు పాజిటివ్ గా వచ్చిందని చెప్పారు. 

నెల రోజుల తర్వాత మరోసారి టెస్టు నిర్వహించి ఒకరే గర్భం దాల్చినట్లు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. హాస్టల్ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్సీవో లక్ష్మయ్య విద్యార్థినుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.