ఆర్థిక ఇబ్బందులు హైదరాబాద్ లో ఒక కుటుంబాన్ని బలిగొన్నాయి. ఒక కుటుంబంలో అన్నదమ్ములతో పాటు, సోదరి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాదులోని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

హుస్సేనీ ఆలం ఇన్ స్పెక్టర్ నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..పురానాపూల్ లోని పార్థివాడ ప్రాంతానికి చెందిన చెందిన ఎల్ఐసి ఉద్యోగి మధుసూదన్ (42), సోదరి ప్రేమలత (39), సోదరుడు సందీప్ (35) ఒక ఇంట్లో నివాసం ఉంటున్నారు.

వీరిలో ఎవరికీ వివాహం కాలేదు. ఈ ముగ్గురూ ఒకేసారి సొంతింట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి తల్లిదండ్రులు15–20 ఏళ్ల క్రితమే మృతి చెందారు. వీరు ముగ్గురూ ఒకే మాటపై నిలబడతారు. 

ఈ ముగ్గురు లక్షల రూపాయలు అప్పు చేసి పార్ధివాడలో జీ ప్లస్‌–1 ఇళ్లు నిర్మించుకున్నారు. అప్పులిచ్చిన వారు వెంటపడుతుండటంతో నెల రోజులుగా ఇంటిని వదిలి కనిపించకుండా తిరుగుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి పార్థివాడకు చేరుకున్న వీరు ముగ్గురు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

విషాదం : కరోనాతో ఒకరికి తెలియకుండా ఒకరు... కుటుంబం మొత్తం......

ఈ విషయాన్ని జుమ్మెరాత్ బజార్ లోని ఉంటున్న తమ స్నేహితుడు గోపిసింగ్ కు మధుసూదన్ వాట్సాప్ సందేశం పంపించాడు. ‘మాఫ్ కర్ దేనా భాయ్’ అనే సందేశాన్ని శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు పంపాడు.

ఆ తరువాత ముగ్గురు కలిసి ఒకే గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధుసూదన్ మెసేజ్ చూసిన గోపిసింగ్ తిరిగి ఫోన్ చేస్తుండగా.. మధుసూదన్ లిఫ్ట్ చేయడం లేదు. దీంతో గోపీసింగ్ పార్థివాడకు చేరుకున్నాడు. వెంటనే అక్కడే ఉన్న బస్తీ నివాసి శశికిరణ్ కు సమాచారమిచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పక్కింటి గోడపైకి ఎక్కి లోపలికి వెళ్లి చూడగా ముగ్గురు విజగజీవులై కనిపించారు.