డ్యూటీని పక్కనబెట్టి టిక్ టాక్ వీడియోలు చేసిన ముగ్గురు మహిళా ఉద్యోగులను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. కరీంనగర్ వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న దివ్యమణి, సమత, ల్యాబ్ అసిస్టెంట్ జయలక్ష్మీ విధులు పక్కనబెట్టి.. టిక్‌టాక్‌లో నటించారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ప్రభుత్వోద్యోగులకు ఉండి క్రమశిక్షణ తప్పడంతో ముగ్గురిపై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ముగ్గురు యువతులు కారుణ్య నియామకాల్లో భాగంగా ఉద్యోగం పొందిన వారు కావడం గమనార్హం. కాగా.. విధులు పక్కనబెట్టి టిక్‌టాక్‌లో నటించిన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య విద్యార్ధులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.