నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం నునావత్ తండాలో శుక్రవారం నాడు ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య చేసుకొన్నాడు. కిషన్, తన ఇద్దరు పిల్లు హర్షవర్ధన్, అఖిల్ కు విషమిచ్చి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


నల్గొండ: ఉమ్మడి Nalgonda జిల్లాలోని Damarcharlaమండలంలోని Nunavath thandaలో శుక్రవారం నాడు విషాదం చోటు చేసుకొంది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఉరేసుకొని Suicide చేసుకొన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
నునావత్ తండాకు చెందినKisan తన ఇద్దరు పిల్లలు Harshavardhan, Akhil లకు విషమిచ్చి చంపాడు.ఆ తర్వాత కిషన్ కూడా ఆత్మహత్య చేసుకొన్నాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. 

also read:Warangal Farmer Suicide:తెలంగాణలో ఆగని అన్నదాతల ఆత్మహత్యలు... తాజాగా యువరైతు బలి

ఇద్దరు పిల్లలను తన వెంట పొలం వద్దకు తీసుకొచ్చిన కిషన్ పురుగుల మందును కూల్ డ్రింకులో కలిపి ఇచ్చాడు. ఈ కూల్ డ్రింక్ తాగిన హర్షవర్ధన్, అఖిల్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత కిషన్ అక్కడే ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. కుటుంబ కలహాలతో పాటు ఆర్ధిక ఇబ్బందులు కూడా ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

భార్యపై అనుమానంతోనే ..

నునావత్ తండాకు చెందిన కిషన్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు తన భార్య భూలక్ష్మిపై అనుమానం ఉంది. తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొందని అనుమానిస్తున్నాడు. ఈ విషయమై తరచుగా భార్యతో గొడవకు దిగేవాడు. గురువారం నాడు పిల్లలకు కొత్త బట్టలు కొని పెడతానని ఆటోలో పిల్లలను తీసుకెళ్లాడు. జ్యూస్ బాటిల్ లో పురుగుల మందును కలిపి పిల్లలకు తాగించాడు. పిల్లలు మరణించిన తర్వాత కిషన్ కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.