పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కొత్తపల్లి సమీపంలో రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు మృతిచెందారు. 

పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు మృతిచెందారు. వివరాలు.. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌.. పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి సమీపంలో కార్మికులను ఢీకొట్టింది. కొత్తపల్లి శివారులోని హుస్సేన్‌మియా వాగువద్ద కార్మికులు ట్రాక్ మరమ్మతుల చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతి చెందిన వాళ్లలో ఒకరు పర్మినెంట్ రైల్వే ఉద్యోగి కాగా, ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులుగా తెలుస్తోంది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకన్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.