హైదరాబాద్ నానక్‌రామ్ గూడలో నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. రక్షణ గోడ లేకపోవడంతో గోల్ఫ్ కోర్స్‌లోకి వెళ్లారు చిన్నారులు.
హైదరాబాద్ నానక్‌రామ్ గూడలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక గోల్ఫ్ కోర్స్ దగ్గర వున్న నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. రక్షణ గోడ లేకపోవడంతో గోల్ఫ్ కోర్స్‌లోకి వెళ్లారు చిన్నారులు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ఇక.. ఇదే నెల ప్రారంభంలో మేడ్చల్ జిల్లాలోనూ విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జవహర్‌నగర్ మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతిచెందారు. వీరిలో ఐదుగురు చిన్నారులే.
