Asianet News TeluguAsianet News Telugu

బడికి బయల్దేరిన ఆ ముగ్గురు అన్నదమ్ములు.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

మెదక్ జిల్లా చేగుంట మండలలో దారుణం జరిగింది. స్కూల్‌కు వెళ్లడానికి ద్విచక్రవాహనంపై బయల్దేరిన ముగ్గురు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదిలారు. చేగుంట సమీపంలోని జీవిక పరిశ్రమ నుంచి లారీ ఆకస్మికంగా దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

three brothers died in road accident in medak
Author
Medak, First Published Dec 21, 2021, 4:37 AM IST

మెదక్: బడి కోసం బయల్దేరిన ఆ ముగ్గురు అన్నదమ్ములు అనంతలోకాలకు వెళ్లిపోయారు. తమ్ముళ్లు ప్రదీప్, అరవింద్‌లను స్కూల్‌లో విడిచిపెట్టడానికి 20 ఏళ్ల రాకేశ్ ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. కానీ, మార్గమధ్యలోనే ఓ Lorry వల్ల రోడ్డ ప్రమాదం జరిగింది. ఇందులో వాహనం నడుపుతున్న రాకేశ్ అక్కడికక్కడే మరణించాడు. ఆయన ఇద్దరు తమ్ముళ్ల(Brothers)ను హాస్పిటల్ తీసుకెళ్తుండగా దారి మధ్యలోనే ప్రాణాలు విడిచారు. మెదక్ జిల్లా చేగుంట(Chegunta in Medak)లోని జీవిక పరిశ్రమ వద్ద సోమవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

చేగుంట మండలం ఉల్లి తిమ్మాయిపల్లికి చెందిన పండ్ల రాకేశ్(20), సొంత తమ్ముడైన ప్రదీప్(15), వరుసకు తమ్ముడైన పండ్ల రాజు(14)ను బైక్‌పై ఎక్కించుకుని చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దింపడానికి బయల్దేరాడు. కానీ, చేగుంట శివారులోని జీవిక పరిశ్రమ వద్దకు రాగానే గేటు లోపలి నుంచి ఆకస్మికంగా లారీ బయటకు వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాకేశ్ అక్కడికక్కడే మరణించాడు. ప్రదీప్, రాజులను హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గంమధ్యలోనే చనిపోయారు.

Also Read: Road Accident: పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు సహా చిన్నారి మృతి

రాకేశ్ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఆయన తమ్ముడు ప్రదీప్ 10వ తరగతి విద్యార్థి. కాగా, పండ్ల రాజు 8వ తరగతి చదువుతున్నారు. రాకేశ్, ప్రదీప్ తండ్రి, రాజు తండ్రులు గతంలోనే మరణించారు. దీంతో ఇంటి బాధ్యతలు తల్లులే మోస్తున్నారు. బిడ్డలనే కళ్లలో పెట్టుకుని బతుకు భారాన్ని మోస్తున్నారు. ఎదుగుతున్న పిల్లలే వారి ధైర్యం. కానీ, రోడ్డు ప్రమాదంలో చేతికి అందవస్తున్న పిల్లలూ మరణించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు.

ఘటన గురించి తెలియగానే గ్రామస్తులు పెద్దమొత్తంలో తరలి వచ్చారు. చేగుంట సమీపంలోని జీవిక పరిశ్రమ ముందు ధర్నాకు దిగారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు ప్రమాద స్థలానికి వచ్చి పరిశీలించారు. బాధితు కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంత్యక్రియల కోసం చెరో రూ. 50 వేల డబ్బును ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సుభాశ్ గౌడ్ వెల్లడించారు.

Also Read: Road Accident: అమెరికాలో కారు యాక్సిడెంట్.. జనగామ జిల్లా వాసి తనయుడు దుర్మరణం

పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. గోదావరిఖని(Godavarikhani)లో గంగానగర్ వద్ద సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. రెండు లారీలు పరస్పరం ఢీకొట్టుకుని పక్కనే ఉన్న ఆటోపై పడ్డాయి. దీంతో ఆ ఆటలో ప్రయాణిస్తున్న దంపతులు సహా చిన్నారి మరణించారు. మరికొందరూ ఈ ఘటనలో గాయపడ్డారు. స్థానికులు ఈ ప్రమాద విషయాన్ని వెంటనే పోలీసులకు చేరవేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో శిథిలాల కింద ఇరుక్కున్న చిన్నారిని బయటికి తీశారు. గాయపడ్డవారిని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios