ఇందులో ఓ బ్యాంకు ఖాతా షిమ్రాంగ్ ది. ఆ బ్యాంకు ఖాతా వివరాలు సేకరించిన ఇన్స్పెక్టర్ సతీష్ బృందం సోమవారం బెంగళూరుకు వెళ్ళింది. ఫోన్ నెంబర్, ఇతర వివరాల ఆధారంగా షిమ్రాంగ్, జములు, ఇమ్మానుయేల్ లను పట్టుకున్నారు. బెంగళూరులోనే మరికొంత మంది నిందితులు ఉన్నారన్న సమాచారంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు
నారాయణగూడ : hyderabadలోని AP Mahesh Cooperative Bankపై Cyber attack caseలో పోలీసులు పురోగతి సాధించారు. ఇద్దరు నైజీరియన్లు జములు, ఇమ్మానియేల్ మణిపురి యువతి షిమ్రాంగ్ లను బెంగళూరులో సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు మంగళవారం తీసుకువచ్చి Judicial remandకు తరలించారు. జములు, షిమ్రాంగ్ ప్రేమికులని.. ఇద్దరూ కలిసే ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. మహేష్ బ్యాంకు సర్వర్ లోకి ప్రవేశించి రూ. 12.90 కోట్లు కొల్లగొట్టిన నైజీరియన్ ఈ మొత్తాన్ని దేశంలోని వేర్వేరు నగరాల బ్యాంకుల్లో 128 ఖాతాలకు నగదు బదిలీ చేశాడు.
ఇందులో ఓ బ్యాంకు ఖాతా షిమ్రాంగ్ ది. ఆ బ్యాంకు ఖాతా వివరాలు సేకరించిన ఇన్స్పెక్టర్ సతీష్ బృందం సోమవారం బెంగళూరుకు వెళ్ళింది. ఫోన్ నెంబర్, ఇతర వివరాల ఆధారంగా షిమ్రాంగ్, జములు, ఇమ్మానుయేల్ లను పట్టుకున్నారు. బెంగళూరులోనే మరికొంత మంది నిందితులు ఉన్నారన్న సమాచారంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు
షిమ్రాంగ్ ఖాతాలో రూ. 52 లక్షలు....
మహేష్ బ్యాంక్ నుంచి కోట్ల నగదు కాజేసేందుకు పథకం వేసిన నైజీరియన్లు నగదు బదిలీ చేసుకునేందుకు అవసరమైన బ్యాంకు ఖాతాదారులను కూడా ఎంచుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. బ్యాంకు ఖాతా ఇస్తే కేరళలో ఉన్న వారికి పది శాతం, డిల్లీలో 15 శాతం, బెంగళూరులో 30 శాతం కమీషన్ ఇస్తామంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. వారితో మాట్లాడుకున్నాక ప్రధాన నిందితుడు మొత్తం 128 ఖాతాల్లోకి చకచకా నగదు బదిలీ చేశాడు. ఈ క్రమంలోనే షిమ్రాంగ్ ఖాతాలోకి రూ. 52 లక్షలు జమ చేశాడు. ఈ నగదును ఆమె ఇమ్మానియేల్,జములు సహకారంతో వేగంగా విత్ డ్రా చేసుకుంది.
ఆ తర్వాత తన కమిషన్ మినహాయించుకుని నైజీరియన్ సూచించిన వారికి నగదు ఇచ్చేసింది. ఇన్స్పెక్టర్ సతీష్ బృందం షిమ్రాంగ్, ఆమెతో పాటు పట్టుపడిన వారి వివరాలను సేకరించారు. ఐదేళ్ల క్రితం చదువుకునేందుకు బెంగళూరు వచ్చిన ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంది. నైజీరియా నుంచి వచ్చిన జములుతో మూడేళ్ల క్రితం పరిచయమయ్యింది. జములు రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో బీఫార్మసీ చదువుకుంటున్నాడు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. మరోవైపు నైజీరియా నుంచి చదువుకునేందుకు బెంగళూరు వచ్చిన ఇమ్మానుయేల్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. అతడికి మహేష్ బ్యాంకు పై సైబర్ దాడి చేసిన నైజీరియన్ కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
ఇద్దరు ఢిల్లీకి చెందిన వారే…
మహేష్ బ్యాంకు కేసులో ఢిల్లీకి వెళ్లిన ఇన్స్పెక్టర్లు రమేష్, జి. వెంకట్రామిరెడ్డిల బృందం మంగళవారం సాయంత్రం ఇద్దరు ఢిల్లీ వాసులను (ఓ మహిళ, ఓ యువకుడు)అదుపులోకి తీసుకున్నారు. ఒక బ్యాంకు ఖాతా కావాలంటూ నైజీరియన్ ఆ యువకుడిని సంప్రదించాడు. అతడు తనకు పరిచయమైన మహిళతో ఈ విషయం చెప్పి కమీషన్ ఇస్తానంటూ ఆమెను ఒప్పించాడు. ఆమె ఖాతాలో నగదు జమ కాగానే...మూడు రోజుల క్రితం ఇద్దరూ వెళ్లి నైజీరియన్ సూచించిన వ్యక్తికి ఇచ్చేసి వచ్చారు.