సూర్యాపేట: టపాకాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఐదేళ్ల కుర్రాడు  గౌతమ్ ను కిడ్నాప్ చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు.గౌతమ్ ను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.

సూర్యాపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన గౌతమ్  ఈ నెల 14వ తేదీ రాత్రి ఏడు గంటల సమయంలో టపాకాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లి అదృశ్యమయ్యాడు.బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పరిచయం ఉన్న వ్యక్తే గౌతమ్ ను తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. రూ. 10 లక్షలు ఇవ్వాలని గౌతమ్ తండ్రిని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు.  కిడ్నాపర్లు చేసిన ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు.

కిడ్నాపర్లకు డబ్బులిస్తామని నమ్మించి దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ పై తొలుత గౌతమ్ ను మిర్యాలగూడకు తీసుకెళ్లారు. ఆ తర్వాత హైద్రాబాద్ తీసుకెళ్లారు.డబ్బులిప్పిస్తామని కిడ్నాపర్లను  నమ్మించారు.

బాణసంచా కొనేందుకు వెళ్లి అదృశ్యం: సూర్యాపేటలో ఐదేళ్ల గౌతమ్ కోసం పోలీసుల గాలింపు

డబ్బులు ఇచ్చే నెపంతో  దుండగులను మిర్యాలగూడలో అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.గౌతమ్ ఇంటికి సమీపంలోని టైలర్ షాపునకు కిడ్నాపర్లు ఫోన్ చేశారు. గౌతమ్ ను అప్పగించాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్లు కోరారు.

ఈ టైలర్ షాపునకు వచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తే నిందితుల ఆచూకీ తెలిసిందని పోలీసులు తెలిపారు. గౌతమ్ ను కిడ్నాప్ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.