సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐదేళ్ల గౌతమ్ సాయి అదృశ్యమయ్యాడు.  బాలుడి ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సూర్యాపేటలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన ఐదేళ్ల గౌతమ్ టపాకాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లి కన్పించకుండా పోయాడు. టపాకాయల దుకాణంలో టపాకాయలు కొనుగోలు చేసి సైకిల్ పై సగం దూరం వద్దకు వచ్చి కన్పించకుండా పోయాడు.

బాలుడు ఉపయోగించిన సైకిల్ ను కుటుంబసభ్యులు గుర్తించారు. ఆ ప్రాంతంలో ఉన్నవారిని కూడ కుటుంబసభ్యులు విచారించారు. కానీ బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు.

స్థానికంగా గౌతమ్ ఆచూకీ కోసం కుటుంబసభ్యులు వెతికారు. కానీ అతని  ఆచూకీ గురించి లభ్యం కాలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.గౌతమ్ ను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

గౌతమ్ కన్పించకుండాపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు గౌతం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని సీసీ కెమెరాల ఆధారంగా గౌతం ఆచూకీ కోసం విచారిస్తున్నారు.