Asianet News TeluguAsianet News Telugu

బంగారాన్ని రేకులుగామార్చి, అండర్ వేర్ లో దాచి.. పంతంగి టోల్ గేట్ వద్ద మూడున్నర కిలోల బంగారం పట్టివేత..

మూడున్నర కిలోల బంగారాన్ని సన్నని రేకులుగా మార్చి.. అండర్ వేర్ లో దాచి తరలిస్తున్న వ్యక్తులను పంతంగి టోల్ గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. 

three and half kg gold seized in hydrerabad vijayawada national highway
Author
First Published Oct 31, 2022, 11:10 AM IST

చౌటుప్పల్ : మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ గేట్ వద్ద ఏర్పాటుచేసిన చెక్పోస్ట్ వద్ద మూడున్నర కేజీల బంగారం పట్టు బడింది. రూ.1.90 కోట్ల విలువైన బంగారాన్ని ఆదివారం తెల్లవారుజామున ఎస్ఎస్ టీ (స్టాటిస్టికల్ సర్వేటెన్స్ టీం) అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన హర్షద్, షరీఫ్, జావేద్, సుల్తానా  దుబాయ్ లోని బంధువుల ఇంటికి వెళ్లారు.

మూడున్నర కిలోల బంగారాన్ని ద్రవరూపంలోకి మార్చి సన్నని రేకులుగా  ప్యాక్ చేసి అండర్వేర్ లో ఉంచుకుని విమానంలో ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం విమానాశ్రయంలో దిగారు. ఎర్టిగా కారులో హైదరాబాద్ కు వస్తుండగా,  పంతంగి టోల్గేట్  వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో దొరికిపోయారు. వారి నుంచి  బంగారం, కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అధికారులకు అప్పగించారు. 

తెలంగాణలో ఆరో రోజు రాహుల్ గాంధీ భారత్ జడో యాత్ర.. మధ్యాహ్నం కొత్తూరులో ప్రెస్ మీట్..

కాగా, పోలీసులు వీరిని బంగారం స్మగ్లింగ్ ముఠా అనుమానిస్తున్నారు. వీరు దుబాయ్ ఎలా వెళ్లారు? వీరికి బంగారం ఎవరు ఇచ్చారు? ఏర్పాట్లను దాటుకుంటూ ఇక్కడి వరకు ఎలా వచ్చారు? లేదంటే గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఎవరైనా బంగారం ఇచ్చారా? అనేది ఆరా తీస్తున్నారు.

కాగా, నిరుడు డిసెంబర్ లో వెలుగు చూసిన ఇలాంటి స్మగ్లింగ్ షాక్ కు గురి చేసింది. మలద్వారంలో బంగారం పెట్టుకొని దొంగ రవాణా (స్మగ్లింగ్) చేస్తున్న నలుగురు సూడాన్ దేశస్తులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి ఏకంగా 7.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 11 రాత్రి దుబాయ్ నుంచి శంషాబాద్ కు వచ్చిన విమానంలోని ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల నడక తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో అప్రమత్తమయ్యారు.

వారిని వైద్యాధికారుల దగ్గరికి తీసుకెళ్ళి పరీక్ష చేయించారు. వారు మలద్వారంలో బంగారం పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించి, బయటకు తీయించారు. ఈ నలుగురు సుడాన్ దేశస్థులని, వారు స్మగ్లింగ్ చేస్తున్న బంగారం విలువ రూ. 3.6 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని ఎవరు ఎక్కడినుంచి, ఎక్కడికి అక్రమ రవాణా చేస్తున్నారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఇలాంటి సంఘటనే సెప్టెంబర్ 29న ఇంఫాల్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడో ప్రయాణికుడు.. అతని దగ్గర దొరికిన బంగారంకంటే... స్మగ్లింగ్ కోసం దాన్ని దాచిపెట్టిన ప్రదేశం కస్టమ్స్ అధికారులను షాక్ కు గురి చేసింది. ఓ ప్రయాణికుడి  దగ్గర 900 గ్రాముల బరువున్న.. సుమారు రూ. 42 లక్షల విలువ చేసే బంగారు పేస్ట్ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)స్వాధీనం చేసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 909.68 గ్రాముల బరువున్న నాలుగు మెటల్ పేస్ట్ ప్యాకెట్లను అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. అతను కూడా మల ద్వారంలో 909.7 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి నాలుగు ప్యాకెట్లలో దాచాడు.

Follow Us:
Download App:
  • android
  • ios