అవును మీరు చదువుతున్నది నిజమే... శశికళ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రాణహాని ఉందట. స్వయంగా ఈ విషయాన్ని కేసీఆర్ అన్న కుమార్తె చెబుతున్నారు.
అవును నిజమే... శశికళ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రాణహాని ఉందట. స్వయంగా ఈ విషయాన్ని కేసీఆర్ అన్న కుమార్తె చెబుతున్నారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా ఉన్న రేగులపాటి రమ్య స్వయంగా కేసీఆర్ అన్న కుమార్తె. ఈ విషయం అందరికీ తెలిసిందే.
తమిళనాట శశికళ రాజకీయ డ్రామా నెలకొన్న నేపథ్యంలో ఈమె శశికళ ప్రస్తావన తేవడం, అందునా సీఎంకు శశికళ వల్లే ప్రాణహాని ఉందని ఆరోపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఇంతకీ రమ్య చెబుతున్నది తమిళనాడు శశికళ గురించి కాదట... కేసీఆర్ మరదలు కుదురుపాక శశికళ గురించి అట. ఆమె వల్లే సీఎం కు ప్రాణహాని ఉందని రమ్య ఆరోపించడం గమనార్హం.
తమిళనాడులాగా తెలంగాణలో కుదురుపాక గ్రామానికి చెందిన కొందరు మాఫియాగా ఏర్పడి కేసీఆర్ ప్రాణానికి హాని తలపెట్టే అవకాశం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
