హైదరాబాద్: తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఆశ్వత్థామరెడ్డిని కొనసాగించడం పట్ల మరో నేత థామస్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆశ్వత్థామరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న థామస్ రెడ్డి ఇవాళ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టుగా ఆయన తెలిపారు.

టీఎంయూ రాష్ట్ర కార్యవర్గం ఆదివారం నాడు జరిగింది. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.  ఈ సమావేశంలో ఆశ్వత్థామరెడ్డిని ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ  తీర్మానం చేశారు. 

ఆశ్వత్థామరెడ్డి సహా ఆయన మద్దతుదారులు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.   ఆర్టీసీలో కార్మికసంఘాలను మళ్లీ అధికారికంగా కార్యకలాపాలు చేపట్టేందుకు వీలు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరుతూ ఈ భేటీలో తీర్మానం ఆమోదించారు.

ఇవాళ థామస్ రెడ్డి వర్గం తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ కు అనుబంధంగా ఆర్టీసీ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.థామస్ రెడ్డి వర్గం  టీఆర్ఎస్ అనుబంధంగా ఏర్పాటు చేసే కార్మిక సంఘంలోొ చేరుతారా.. ఏం చేస్తారనేది సర్వత్రా చర్చ సాగుతోంది.