కమెడియన్ విజయ్ మృతిపై భార్య వనిత ఏమన్నదంటే ?

కమెడియన్ విజయ్ మృతిపై భార్య వనిత ఏమన్నదంటే ?

ఆత్మహత్యకు పాల్పడిన సినీ హాస్య నటుడు విజయ్ గురించి ఆయన భార్య చాలా విషయాలను వెల్లడించింది. విజయ్ ఆత్మహత్య ఘటన తర్వాత ఆమె మీడియా ముందుకొచ్చి అనేక అంశాలను వెల్లడించింది.

విజయ్ కి అక్రమ సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. విజయ్ కి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని, తాను కళ్లారా చూశానని చెప్పింది. ఆడవాళ్లు స్నేహితులుంటే పరవాలేదు కానీ.. ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకోవడంతోనే తమ మధ్య గొడవలు వచ్చాయని తెలిపింది.

విజయ్ అక్రమ సంబంధాల విషయంలో పలుమార్లు విజయ్ తల్లిదండ్రులకు కూడా చెప్పానని తెలిపింది. అయినప్పటికీ విజయ్ లో మార్పు రాలేదని వివరించింది. అక్రమ సంబంధాల విషయంలో విజయ్ తో ఆయన తండ్రి కూడా గొడవ పెట్టుకున్నారని చెప్పింది. అందుకే తమ మధ్య గత రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నాయని ఆరోపించింది.

విజయ్ గురించి మా మామయ్య, అత్తయ్యకు చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశాను అని మీడియాకు వివరించింది. తానేమీ విజయ్ ఆస్తిని అడగలేదు. నేను సంపాదించిన ఆస్తినే అడగానని పేర్కొంది.

శశిధర్ అనే వ్యక్తి (నవయుగ డైరెక్టర్) తో కలిసి వేధిస్తున్నట్లు విజయ్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటిపైనా విజయ్ సతీమణి వనిత స్పందించింది. అసలు శశిధర్ ఎవరో తనకు తెలియదని స్పష్టం చేసింది. ఏవేవో విమర్శలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించింది.

అబ్బాయి చనిపోయిన బాధలో విజయ్ తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారని, తాను సైతం తన భర్త చనిపోయిన బాధలో ఉన్నానని తెలిపింది. విజయ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తనకు తెలియని పేర్కొంది. తాను కానీ, తన అడ్వకెట్ కానీ విజయ్ మీద ఎలాంటి వేధింపులు చేయలేదని తెలిపింది.

తన కూతురు వారంలో రెండు రోజులు తండ్రి వద్ద ఉంచాలన్న కోర్టు ఆదేశం ఉందని ఆమేరకు నేను విజయ్ వద్దకు వెళ్లానని చెప్పింది. విజయ్ ఆత్మహత్యకు తానే కారణమని వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos