Asianet News TeluguAsianet News Telugu

ఫార్మూలా ఈ -రేస్ రద్దు : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయం.. కేటీఆర్

హైదరాబాద్ ఇ-ప్రిక్స్ వంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా మన నగరం, దేశం బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతాయి. అలాంటి దీన్ని రద్దు చేయడం అంటే తిరోగమన చర్యే అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు

This is truly a poor and regressive decision by the Congress Government, KTR tweet - bsb
Author
First Published Jan 6, 2024, 11:50 AM IST

హైదరాబాద్ : ఫార్మెలా ఈ రేస్ రద్దు నిర్ణయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయం అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

హైదరాబాద్ ఇ-ప్రిక్స్ వంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా మన నగరం, దేశం బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతాయి. భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఇ-ప్రిక్స్‌ని తీసుకురావడానికి మేము చాలా కృషి చేశాం. ఎంతో సమయాన్ని వెచ్చించాం. 

సస్టైనబిలిటీ ఫోకస్, బజ్‌వర్డ్‌గా మారిన ప్రపంచంలో, హైదరాబాద్‌ను ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా ప్రదర్శించడానికి ఈవీ ఔత్సాహికులు, తయారీదారులు, స్టార్టప్‌లను ఆకర్షిస్తూ ఒక వారం పాటు ఈవీ సమ్మిట్‌ను నిర్వహించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్‌ను ఒక సందర్భంగా ఉపయోగించుకుంది.

ఫార్మూలా ఈ -రేస్ రద్దు:నిర్వాహకుల ప్రకటన

సస్టైనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్‌కు కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి మేం తెలంగాణ మొబిలిటీ వ్యాలీని కూడా ప్రారంభించాం. ఇప్పుడు దీన్ని రద్దు చేయడం అంటే తిరోగమన చర్యే అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాగా, రెండో ఫార్మూలా ఈ రేస్ హైదరాబాద్ లో ఈ ఏడాది ఫిబ్రవరి  10న జరగాల్సి ఉంది.  

అయితే,  నిర్వాహకులు తెలంగాణ మున్సిఫల్ శాఖ తమతో చేసుకున్న  ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని అభిప్రాయపడ్డారు. దీంతో  ఈ ఏడాది ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన ఈ రేస్ ను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు నిర్వాహకులు ట్వీట్ చేశారు. దీనిపైనే కేటీఆర్ స్పందించారు. 

మరోవైపు గతంలో ఈ రేసులు జరిగిన సమయంలో హైదరాబాద్ లో తీవ్ర ట్రాఫిక్ కష్టాలు ఎదురైన సంగతి తెలిసిందే. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపుతో రోజూ ఆఫీసులు, కార్యాలయాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సయమంలో తీవ్రస్థాయిలో విమర్శలూ వచ్చాయి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios