తెలంగాణలో అధికార పార్టీ నేతలు డ్యాన్స్ లో ఇరగదీసి కుమ్మేస్తున్నారు. ఎక్కడ చూసినా టిఆర్ఎస్ పార్టీ పెద్ద లీడర్లే డ్యాన్స్ చేస్తూ అలరిస్తున్నారు. పబ్లిక్ ప్లేస్ లో డ్యాన్స్ చేయడంలో తుంగతూర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ముందు వరుసలో నిలిచారు. యూనివర్శిటీ నుంచి ఫ్రెష్ గా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఏ చిన్న ఫంక్షన్ అయినా డ్యాన్స్ చేసి అదరగొడుతున్నారు.

కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి ఈటెల రాజేందర్ కొడుకు వివాహ కార్యక్రమంలో మంథని టిఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టా మధు డ్యాన్స్ చేసి దుమ్ము రేపారు. కరీంనగర్ నగర మేయర్ రవీంద్ర సింగ్ పుట్టా మధుతో కలిసి డ్యాన్స్ చేశారు. అంతేకాదు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా పుట్టా మధుతో పోటీ పడ్డారు. పార్టీ పెద్ద నేతలంతా డ్యాన్స్ లో మునిగి ఉంటే కార్యకర్తలు, ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారు చప్పట్లతో కేరింతలు కొట్టారు. ఈ డ్యాన్స్ జరిగింది గత ఏడాది జూన్ లో అయినా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ ఆ డ్యాన్స్ ఒకసారి చూసేయండి మరి.

డ్యాన్స్ లు బాగానే చేస్తున్నారు కానీ.. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి జర జాగ్రత్త సార్లూ అంటున్నారు సామాన్య జనాలు..