బిఇడి సర్టిఫికెట్ అమ్ముతానంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి సంచలనం సృష్టించాడు అశోక్ జోగుపర్తి అనే విద్యార్థి. ఈ వార్త తెలంగాణ అంతటా పాకింది. సోషల్ మీడియాను దాటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హల్ చల్ చేసింది. తెలంగాణ సర్కారు తనలాంటి నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని, ఉమ్మడి రాష్ట్రంలో తాను డిఎస్సీ పరీక్షకు అర్హుడినైతే.. తెలంగాణ వచ్చిన తర్వాత అనర్హుడిగా మిగిలానని అశోక్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన బిఇడి సర్టిఫికెట్ అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును సిఎం రిలీఫ్ ఫండ్ కు దానం చేస్తానని కూడ పేర్కొన్నాడు. ఎవరూ కొనకపోతే తన సర్టిఫికెట్లు అన్నీ యూనివర్శిటీకి వాపస్ ఇస్తానని కూడా తన పోస్టులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అశోక్ పై టిఆర్ఎస్ అభిమానులు కొందరు ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా అశోక్ అనే యువకుడు రేవంత్ అభిమాని అని, రేవంత్ దగ్గర పనిచేస్తున్న వ్యక్తి అని పోస్టులు పెట్టారు. దీనికి సమాధానంగా అశోక్ మరో పోస్టు పెట్టాడు. అందులో అనేక అంశాలను వివరించాడు. తాను నిజమైన తెలంగాణవాదినని, రేవంత్ రెడ్డితోనే కాదు తాను కేటిఆర్ తో, కవిత తో దిగిన ఫొటోలను కూడా వెల్లడించాడు.

అశోక్ రాసిన రెండో పోస్టును యదాతదంగా ఇక్కడ ప్రచురిస్తున్నాము.

కులకర్ణి ధరనీందర్ అనే TRS అన్నయ్య కు
.... నీ ఫేస్ బుక్ పేజీలో నా గురించి కొన్ని వార్తలు రాశారు....దానికి నా సమాధానం..
1) నేను రేవంత్ దగ్గర పనిచేశానని..చేశాను..నాకు జీతం ఇచ్చాడు కాబట్టీ చేశాను...దానికి నేనేమీ భయపడను,సిగ్గు పడను చెప్పుకోవటానికి. నాకు నా కుటుంబానికి వ్యక్తిగతం గా చాలా సహాయం చేశాడు..
2) నేను TDP కార్యకర్తనని అన్నారు..టీడీపీ వాళ్లకు మెంబర్షిప్ కార్డ్ ఉంటుంది...అక్కడకెళ్ళి చెక్ చేసుకోండి నాకు మెంబర్షిప్ ఉందో లేదో...
3) పెద్ద కుట్ర చేస్తున్నాడు అని అన్నావ్..నేను ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన పత్రిక లో పనిచేస్తున్నాను..ఆ పత్రికకు కొన్ని విలువలు ఉన్నాయి. వాటి ప్రకారం నడుచుకోవాలి..నా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ఊరుకోరు..
4) నేను రేవంత్ రెడ్డి ని కలవక 2నెలలకు పైగానే అయ్యింది..జుబ్లిహిల్స్ నుంచి రేవంత్ ఇంటివరకు CC కెమరా లు చెక్ చేసుకోండి..నేను ఉన్ననేమో అని..
5) నా FB అంతా బాగానే ఫాలో అయ్యారు కానీ చిన్న లాజిక్ మిస్సయ్యారు...నేను కెసిఆర్, KTR, కవితక్క తో తెలంగాణ ఉద్యమంలో దిగిన ఫోటోలు పెట్టడం మర్చిపోయారు మీరు. ప్రత్యేకించి KTR అంటే నాకెంత ఇష్టమో మీ దగ్గర ఉండే TRS కార్యకర్తలను అడిగి తెలుసుకోండి.
6) మా అమ్మ, నాన్న ల ఫోటోలు కూడా మీ పబ్లిసిటీ కి వాడుతున్నారు..వాళ్లేం చేశారు...అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.
7) మీరు అసలు విషయం వదిలేసి ఎవేవో రాశారు.. అసలు విషయం పక్కన పెట్టారు..NCTE గైడ్ లైన్స్...నేను ప్రధానంగా ఆవిషయం మాట్లాడాను.. మీరు అది తప్ప అన్ని చెప్పారు..
8) ఏ ప్రభుత్వాలు అందరికీ ఉపాధి కల్పించాలి అంటే కష్టం..ఆ విషయం నాకు తెలుసన్న.. ప్రైవేట్ టీచర్ గా కూడా పనికి రానా అని రాశాను...
9) నేను 2012 DEC 28 న TGVP STATE ప్రెసిడెంట్ శ్రీహరి నాయక్ ఆధ్వర్యంలో నార్త్ బ్లాక్ ముట్టడి కార్యక్రమంలో అరెస్ట్ అయితే ఇప్పుడు ఎంపీ జితేందర్ రెడ్డి మమ్మల్ని స్టేషన్ బైల్ పై విడుదల చేసి KCR ఇంటికి తీసుకెళ్ళి భోజనం చేయించాడు...KCR స్వయంగా పిల్లలకు భోజనం పెట్టామన్నారు..నాకు చాలా సంతోషం అనిపించింది...ఆ అన్నం పెట్టిన విశ్వాసంతో 2014 లో తెరాస కు అనుకూలంగా ప్రచారం చేసా.. మా నియోజక వర్గంలో ఉత్తంకుమర్ రెడ్డి అభివృద్ది పనులు బాగా చేశాడు. అయిన అమరుడు తల్లి శంకరమ్మకు ఓట్ వేయాలని ప్రచారం చేసా..
10) నేను కులాంతర వివాహం చేసుకున్నాను. నాకు కొన్ని బాధలు, భాద్యతలు ఉంటాయి. ఇంతకు ముందులా ప్రవర్తించాలని ఏమైనా ఉందా అన్నయ్య..
11) మీకు వీలైతే నా సమస్యపై ప్రభుత్వానికి విన్నవించిండి...
12) ఈ అంశాలపై మీతో చర్చించటానికి నేను సిద్ధం..
నేను మళ్ళీ చెబుతున్నాను. నేను ఎవరిని విమర్శించటం కోసం ఈ పోస్టులు పెట్టడం లేదు. వీలైతే నాకు న్యాయం చేయటానికి ప్రయత్నించండి.
13) దాసరాజు లింగాస్వామి ఇతను MA M.ED పూర్తి చేశాడు..అతని సమస్య కూడా నాలాంటిదే..OU లోనే ఉంటున్నాడు..ఇప్పటికీ TSPSC చుట్టూ కాళ్ళకున్న చెప్పులరిగేలా తిరుగుతున్నాడు...
( నేను చిన్నప్పుడు చిన్న పిల్లాడిలానే ప్రవర్తించాను, చిన్న పిల్లాడిలా ఆలోచించాను, చిన్నపిల్లాడిలా అర్థం చేసుకున్నాను..పెద్దయ్యాక చిన్న తరహా పనులు మానేశాను) మీరు అర్థం చేసుకుంటే మంచిది
దయచేసి మీ రాజకీయాల్లోకి నన్ను లాగాకండి
నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొన్ని చిత్రాలు..