అడవుల్లో హల్ చల్ చేసిన కలెక్టరమ్మలుప్రీతిమీనా, అమ్రపాలి సరికొత్త యాత్ర12 కిలోమీటర్లు కాలినడకన పర్యటన 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇద్దరు మహిళా కలెక్టర్లు ఫారెస్టులో హల్ చల్ చేశారు. కిలోమీటర్ల కొద్ది నడిచి సాహసం చేశారు. వారి సాహసం చూసి జనాలు ఔరా అని ఆశ్చర్యపోయారు. ఇంతకూ ఆ మహిళా కలెక్టర్లు ఎవరనుకుంటున్నారా?

వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి, మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా ఇద్దరూ అటవీ పర్యటనకు వెళ్లారు. వాళ్లు బయ్యారం చెరువును సందర్శించారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో బయ్యారం చెరువు నీటితో కలకలలాడుతోంది. అలుగు దునుకుతున్నది. ఈ చెరువును సందర్శించారు ఇద్దరు కలెక్టరమ్మలు. తర్వాత పెద్దగుట్ట ఐరన్ ఓర్ ప్రాంతాన్ని సందర్శించారు. 12 కిలోమీటర్లు కాలినడకన తిరిగారు. మహబూబాబాద్ జిల్లాలోని టూరిజం ప్రాంతాలను చుట్టివచ్చారు ఆ ఇద్దరు లేడీ కలెక్టర్లు.